![Cm Jagan Message On The Occasion Of Good Friday - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/28/Cm-Jagan.jpg.webp?itok=JUvV4gF2)
సాక్షి, తాడేపల్లి: ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు.
మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment