విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ లో ఉన్న పలు చర్చిల ఆధ్వర్యంలో ప్రజలు గుడ్‌ఫ్రైడే కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
విజయనగరం : విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ లో ఉన్న పలు చర్చిల ఆధ్వర్యంలో ప్రజలు గుడ్‌ఫ్రైడే కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు ఆరాధకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధుల్లో క్రీస్తు సందేశాన్ని వినిపిస్తూ గీతాలాపన చేశారు. ఆర్‌సీఎం చర్చి పాస్టర్ మాట్లాడుతూ..క్రీస్తు ఈ లోకాన్ని రక్షించేందుకు భూమిపై అవతరించాడని తెలిపారు. దాంతో పాటు గుడ్‌ఫ్రైడే విశేషాలను వివరించారు.