
పెళ్లి వ్యాన్ బోల్తా
► 35 మందికి గాయూలు
► రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స
తలమడుగు(తాంసి)/ఆదిలాబాద్ రిమ్స్ : తాంసి మండలం దన్నోర గ్రామీపంలోని వాగు మూలమలుపు వద్ద గురువారం పెళ్లి వ్యాన్(ఏపీ 01 ఎక్స్ 8216) బోల్తాపడింది. అందులో ప్రయూణిస్తున్న 35 మంది గాయపడ్డారు. వీరికి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాంసి మండలంలోని పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన పిట్లా అశోక్ కూతురు సరిత వివాహం దన్నోర గ్రామానికి చెందిన వికాష్‌తో గురువారం జరిగింది. పిప్పల్‌కోఠి గ్రామంలోని వారి బంధువులు పెళ్లికి హాజరై వ్యాన్‌లో 35 మంది తిరుగు ప్రయూణమయ్యూరు. దన్నోర గ్రామ సమీపంలోని మూలమలుపు వాగు వద్ద వ్యాన్ అతివేగం కారణంగా అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్‌లో ప్రయూణిస్తున్న వారంతా గాయపడ్డారు.
డ్రైవర్ ప్రవీణ్‌తోపాటు పిప్పల్‌కోఠి గ్రామానికి చెందిన మసూద్, భోజమ్మ, భూమక్క, గంగమ్మ, ప్రేమల, మౌనిక, సాగర్ తదితరులు గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్ తెలిపారు.
వధూవరులకు తప్పిన ప్రమాదం
పెళ్లి కుమారుడు వికాష్, పెళ్లికూతురు సరిత ఇదే వ్యాన్‌లో రావాల్సి ఉండగా.. పెళ్లి కుమారుడి ఇంట్లో బోనాలు వేయడానికి వెళ్లారు. అక్కడ ఆలస్యం కావడంతో మరో వాహనంలో వచ్చారు. దీంతో వధూవరులకు ప్రమాదం తప్పింది.