రెండు బైక్లు ఢీ; ఇద్దరు మృతి | two held, one injured in road accident at Prakasam district | Sakshi
Sakshi News home page

రెండు బైక్లు ఢీ; ఇద్దరు మృతి

Published Thu, Nov 20 2014 10:02 PM | Last Updated on Sat, Aug 25 2018 6:22 PM

two held, one injured in road accident at Prakasam district

ప్రకాశం: జిల్లాలోని చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చీమకుర్తి మండలం, రామతీర్థం వద్ద ఎదురెదుగా వెళ్తున్న రెండు బైక్లు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement