బాలిక బంధువులతో మాట్లాడుతున్న మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీవాణి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురై రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రణస్థలం మండలం కొవ్వాడ గ్రామానికి చెందిన బాలికను మంగళవారం ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు కె.శ్రీవాణి పరామర్శించారు. మేనత్తతో మాట్లాడి బాలిక ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో చదివించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యురాలు తెలపగా, అందుకు వారు అంగీకరించలేదు. అనంతరం బాలిక ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కమిషన్ సభ్యురాలితో పాటు ఆస్పత్రి ఆర్‌ఎంఓ బీసీహెచ్ అప్పలనాయుడు, గైనికాలజిస్టు శశికళ ఉన్నారు.