మాట్లాడుతున్న నరేష్‌జాదవ్
-
రిమ్స్ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించాలి
-
డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌జాదవ్
ఇచ్చోడ : జిల్లాకు చెందిన మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే రిమ్స్ ఆస్పత్రికి రూ.100 కోట్లు కేటాయించాలని, జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్‌జాదవ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్.. గిరిజనులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్యం అందిస్తామని మభ్యపెట్టారని అన్నారు. వైద్యం అందక గిరిజనులు మత్యువాత పడుతున్నారని, పూటకో మాట చెప్పే కేసీఆర్ ప్రభుత్వ పాలనను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏజెన్సీ మరణాలు అరికట్టడానికి పీఎంఎస్‌ఎస్‌వై కింద రూ.1.50 కోట్లు మాంజురు చేసిందని, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొరలపాలన సాగుతోందని, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెపూల నర్సయ్య. డీసీఎంఎస్ డైరెక్టర్ కుంర కోటేశ్వర్, మండల పార్టీ అధ్యక్షుడు మహిముద్‌ఖాన్, ప్రధాన కార్యదర్శి కల్లెం నారాయణరెడ్డి, నాయకులు మాధవ్‌పటేల్, పాండు పటేల్, ఆసీఫ్‌ఖాన్, భూమారెడ్డి, బాబా, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు.