కర్ణాటక: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో మురుగన్ ఆలయం వద్ద ఉన్న పుట్ట నుంచి నాగుపాము బయటకొచ్చి పూజలు నిర్వహిస్తున్న భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. క్రిష్ణగిరి– బెంగళూరు హైవే ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి సమీపంలోని సికారిమేడు బస్టాప్ వద్ద పెద్ద పుట్ట ఉంది. కొన్నేళ్ల కిందట పుట్ట పక్కనే మురుగన్ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయంలో స్థానిక ప్రజలు రోజూ పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం కొంత మంది భక్తులు పూజలు నిర్వహిస్తుండగా ఓ నాగుపాటు బయటకొచ్చి ఆలయ ఆవరణలో పడగెత్తి ఆడింది. కొద్దిసేపటికి మళ్లీ పుట్టలోకి వెళ్లిపోయింది. కాగా ఈ దృశ్యాలను గమనించిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment