విద్యార్థులు సమాజ సేవ చేయాలి
రాయచూరు రూరల్: సమాజ సేవ చేయడానికి విద్యార్థులు ఆసక్తి కనబరచాలని స్కౌట్స్ రోవర్ జిల్లా సంచాలకుడు బసవరాజ్ బోరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన స్కౌట్స్ రోవర్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య, వైద్య అత్యవసర సేవలు ఇతరత్ర వాటిలో చురుకుగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో కళాళాశాల ప్రిన్సిపాల్ యంకణ్ణ, శివయ్య, మహంతేష్, అంబన్న, మల్లన్న, దస్తగిరిసాబ్, ప్రాణేష్‌లున్నారు.
పత్రికా రంగంలో
విలువలు పెరగాలి
బళ్లారిటౌన్: పత్రికా రంగంలో రాజీ రహిత ఆసక్తి, విలువలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు కేవీ ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన కర్ణాటక వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంఘం ఆధ్వర్యంలో కొప్పళలోని పానగంటి కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన భక్తినిధి పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాడు విలేకరులు రాజకీయ నాయకులను కఠినంగా ప్రశ్నిస్తుండేవారన్నారు. అయితే నేడు కఠినంగా ప్రశ్నించే స్థాయిలో లేరన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద తగడూరు మాట్లాడుతూ 1932లో స్థాపించిన కేయూడబ్ల్యూజే విలేకరుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేపట్టి ప్రభుత్వం నుంచి ఎన్నో సదుపాయాలను సాధించిందన్నారు. కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్, కొప్పళ వర్సిటీ కులపతి బీకే.రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది దాదాపు 40 మంది వరకు పాత్రికేయులకు అవార్డులు అందించగా బళ్లారి నుంచి సీనియర్ పాత్రికేయుడు గురుశాంతకు అవార్డును అందజేశారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: అతి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం పాదచారిని ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన హరపనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. మృతుడి పేరు, వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. హరపనహళ్లి టౌన్‌లోని పద్మనాభ పెట్రోల్ బంకు పక్కన ఉన్న రహదారిపై జరిగిన ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైనట్లు హరపనహళ్లి పోలీసులు తెలిపారు.
మహిళా సమానత లేమి బాధాకరం
హొసపేటె: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లి విద్యానికేతన్ పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. శరణేశ్వర్ విద్యా శిక్షణ సంస్థ అధినేత్రి కేఎం.నిర్మలా శశిధర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శరణేశ్వర విద్యాసంఘం ఆధ్వర్యంలో విద్యార్థినుల తల్లులకు వివిధ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. క్రీడా పోటీలను ప్రారంభించి ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించినా సమాజంలో సమానంగా చూడకపోవడం బాధాకరమన్నారు. సమాజానికి మహిళల సహకారం ఎనలేనిది. ఒక ఇంట్లో ఒక సీ్త్ర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే ఇల్లు అందంగా ఉంటుంది. ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, భార్య, అత్తమామలు, మేనకోడళ్లను గౌరవించాలన్నారు. గ్రామీణ క్రీడల్లో గెలుపొందిన తల్లులకు విద్యానికేతన్ తరఫున బహుమతులు అందజేశారు. శరణేశ్వర విద్యాశిక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు, జీఐపీ మాజీ సభ్యులు కానామడుగు కే.ఎం శశిధర్, నిర్వాహకుడు కేఎం.హర్షవర్థన్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులు సమాజ సేవ చేయాలి
విద్యార్థులు సమాజ సేవ చేయాలి
విద్యార్థులు సమాజ సేవ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment