రాజధానిలో మంత్రుల మధ్య కోల్డ్‌వార్
రాయచూరు రూరల్: ప్రజలతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రుల వద్ద మంత్రులిద్దరి మధ్య శీతల సమరం బట్టబయలైంది. సోమవారం రాత్రి బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో రాయచూరు, కొడగు జిల్లాల ఇంచార్జి మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, ఎన్.ఎస్.బోసురాజుల మధ్య వాగ్వాదం జరిగింది. రాయచూరు పోలీస్ శాఖలో డీఎస్పీ బదిలీ కోసం రాయచూరుకు రవినాథ్‌ను బోసురాజు సిఫార్సు చేయగా పాటిల్ ప్రస్తుతమున్న డీఎస్పీ సత్యనారాయణను కొనసాగించాలని తమ అభిప్రాయాలను నేతల ముందుంచారు. దీనిపై పాటిల్ తాను జిల్లా ఇంచార్జి మంత్రిని, తన ఆదేశాలు అధికారులు తప్పకుండా పాటిస్తారని చెప్పినా కొడగు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్న బోసురాజు పదవులు, బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడం, రాయచూరు జిల్లాకు చెందిన ప్రతి విషయంలో తలదూర్చడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి పరమేశ్వర్‌లకు పాటిల్ వివరించారు. గతంలో ఏసీ మహబూబి బదిలీ విషయం, పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, జిల్లాధ్యక్షుడి నియామకాల్లో తనకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారని వారి దృష్టికి పాటిల్ తెచ్చారు. సమావేశంలో రాద్ధాంతం చూసిన జిల్లా శాసన సభ్యులు బసనగౌడ దద్దల్, హంపనగౌడ, బసనగౌడ తుర్విహాళ్, వసంత్ కుమార్, శరణేగౌడ బయ్యాపూర్ సమావేశం నుంచి నిష్క్రమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇంచార్జి మంత్రుల మధ్య శీతల సమరం
పార్టీ, ప్రభుత్వ పెద్దల దృష్టికి వివాదాంశం
రాజధానిలో మంత్రుల మధ్య కోల్డ్‌వార్
Comments
Please login to add a commentAdd a comment