హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి పట్టణంలోని ఎండీహళ్లి ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా ఆచరించారు. ఆ కళాశాల వాణిజ్య విభాగాధిపతి శోభ మాట్లాడుతూ ఓ ఇల్లు, ఓ దేశం సక్రమంగా నడపడంలో పురుషుడి(భర్త) పాత్ర ఎంత ఉంటుందో మహిళ(భార్య) పాత్ర కూడా అంతే ఉంటుందన్నారు. ఇంగ్లిష్ లెక్చరర్ విజయలక్ష్మి పాటిల్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో వారి సేవ అపారం అన్నారు. ఇలాంటి అనన్య సేవలను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బుళ్లన్న మాట్లాడుతూ ప్రతి ఊరిలో గ్రామ దేవతగా మహిళా దేవతను పూజిస్తారన్నారు. అలాగే ప్రతి ఇంట్లో తల్లి పాత్ర ఎంతో కీలకం. అనాది కాలం నుంచి మాతృదేవోభవ అన్నది తమ ఇల్లు, మనస్సుల్లో నిక్షిప్తమైందన్నారు. ఆశా కార్యకర్త రత్న పల్లెదను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్ రాథోడ్, విద్యా హడగలి, శ్రీనివాస్, రేణుక, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో
కోడి శరభయ్య జాతర
● భక్తసాగరంగా హొస దరోజీ గ్రామం
● రథంపై ఉత్సవ మూర్తి ఊరేగింపు
బళ్లారి రూరల్ : బళ్లారి జిల్లా సండూరు తాలూకాలోని హొస దరోజీలో సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో కోడి శరభయ్య జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శనివారం జాతర ప్రారంభం కాగా ఆదివారం రాత్రి అగ్నిగుండం, సోమవారం సాయంత్రం రథోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కోడి శరభయ్య ఉత్సవ మూర్తిని రథంపై ప్రతిష్టించి ఊరేగించారు. ఇంటింటా పూజలు నిర్వహించారు. రథోత్సవంలో హళే దరోజీ, హొస దరోజి, పరిసర గ్రామాల ప్రజలు వేలాది మంది రథోత్సవాన్ని తిలకించారు.
ముత్తగి గ్రామ పంచాయతీ
అధ్యక్షురాలిగా ఉవక్క
హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా ముత్తగి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఉవక్క నాగప్ప లమాణి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఆ తాలూకా టీపీ ఈఓ సావంత్, పీడీఓ రవికుమార్ వ్యవహరించారు. గ్రామ పంచాయతీ సభ్యులు రవి లమాణి, రాము, షణ్ముఖ, గోకుల్, ఇతర సభ్యులు ఈ సందర్భంగా ఎన్నికలో పాల్గొన్నారు. ఎస్‌ఐ గిరీష్ తమ సిబ్బందితో ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహించారు.
గ్యాంగ్ రేప్ కేసులో
ముగ్గురికి జుడీషియల్ కస్టడీ
రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని జుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం విదేశీ మహిళ, హోం స్టే యజమానిపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని గంగావతి కోర్టులో 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. గంగావతి తాలూకా సణాపుర చెరువు వద్ద తుంగభద్ర ఎడమ కాలువ పక్కన ఐదుగురు విదేశీయులు ఆకాశంలో నక్షత్రాలు వీక్షిస్తున్న సమయంలో మల్లేష్, చేతన్ సాయి, శరణ బసవ అనే నిందితులు ముగ్గురిని కాలువలోకి తోసి ఇద్దరు ఆడపిల్లలపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులు కోర్టులో హాజరు పరచడంతో , విచారించిన జడ్జి 14 రోజుల పాటు న్యాయాంగ బంధనంలో ఉంచాలని తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment