రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
● బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● మృతుల స్వస్థలం మాన్వి
రాయచూరు రూరల్: కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ వద్ద కేఎస్‌ఆర్టీసీ బస్, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. గంగావతి నుంచి మంత్రాలయం వెళుతున్న గంగావతి డిపోకు చెందిన కేఎస్‌ఆర్టీసీ బస్, రాయచూరు నుంచి ఆదోనికి వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. మృతులను బైక్‌పై వెళుతున్న హేమాద్రి(55), భార్య నాగరత్నమ్మ(48), కుమారుడు దేవరాజ్(25)లుగా పోలీసులు గుర్తించారు. మాన్వి పోలీస్ స్టేషన్‌లో హేమాద్రి మాజీ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తుండగా, కుమారుడు దేవరాజ్ క్షౌ రిక వృత్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రాత్రి సమయంలో మృతదేహాలను తీసుకురావడంతో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment