
రూ.5,200 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ, బీఎంటీసీ
అసెంబ్లీలో రవాణా మంత్రి వెల్లడి
బనశంకరి/ శివాజీనగర: ఇంధన ధరలు పెరగడం, సిబ్బంది జీతభత్యాలు, బస్సుల నిర్వహణ తదితర కారణాలతో గత ఐదేళ్లలో కేఎస్ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. నాలుగు రవాణా మండళ్లు రూ.5,200 కోట్ల నష్టాల్లో ఉన్నాయని రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో విధానపరిషత్‌లో బీజేపీ సభ్యుడు కేశవ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో కేఎస్ ఆరీ్టసీకి రూ.1500 కోట్లు, బీఎంటీసీ రూ.1544 కోట్లు, కేకే ఆరీ్టసీకి రూ.777 కోట్లు, ఎన్‌డబ్ల్యూకె ఆర్టీసీకి కి రూ.1386 కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపారు. ఇక నారీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల 40 శాతం బస్సులు నష్టాల్లో నడుస్తున్నాయని చెప్పారు. 30 శాతం బస్సులు ఎలాంటి లాభనష్టాలు లేకుండా, 30 శాతం బస్సులు మాత్రమే లాభాల్లో ఉన్నాయని చెప్పారు.
రవాణాశాఖలో ప్రతిరోజు రూ.9.45 కోట్ల ఖర్చు ఉందన్నారు. నష్టాలను భరించడం, రవాణా మండళ్ల ఆర్థిక పునరుద్ధరణకు వివిద పథకాలను రూపొందించామని తెలిపారు. ఇంధన ధరలు పెంపు, వేతనాలు, వాహన విడిభాగాల ధరలపెంపు వల్ల ఆర్థిక భారం ఏర్పడి గత జనవరిలో బస్‌టికెట్ల చార్జీలను 15 శాతం పెంచామని తెలిపారు. నారీ శక్తి పథకానికి 2024–25లో ప్రభుత్వం కేటాయించిన రూ.9,978 కోట్ల నిధుల్లో ఇంకా రూ.2 వేల కోట్లు ఆరీ్టసీకి విడుదల కావాల్సి ఉందన్నారు. నారీ శక్తి పథకం నిధులతో 448 బీఎంటీసీ బస్సులను కొనుగోలు చేశామని చెప్పారు. గతంలో బస్సులు ఒక్కరోజులో 1.40 లక్షల కిలోమీటర్లు ట్రిప్పులు సంచరించేవి. ప్రస్తుతం 1.90 లక్షల కి.మీ. లకు పెరిగిందని తెలిపారు.
గ్యారెంటీ కమిటీలపై మళ్లీ రగడ
గ్యారెంటీ పథకాల అమలు కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ అసెంబ్లీ లోపల, బయట రెండవరోజూ పోరాటం కొనసాగించాయి. బుధవారం సైతం విధానసభలో ధర్నా నిర్వహించటంతో సభా కార్యకలాపాలు సక్రమంగా సాగక మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. కమిటీలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించి వారికి జీతం ఇస్తున్నారని, వెంటనే కమిటీలను రద్దు చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.
బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, జేడీఎస్ పక్ష నాయకుడు సీ.బీ.సురేశ్‌బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. విధానసభలో సభాపతి ముందుచేరి నినాదాలతో హోరెత్తించారు. రోజూ గందరగోళం చేయడం సరికాదు, ఇలాగైతే సభను నడపలేను, దీనికో పరిష్కార మార్గం కనిపెట్టాలని స్పీకర్ యూటీ ఖాదర్ స్పష్టం చేశారు. తాలూకా అధికారులు తహశీల్దార్‌పై నమ్మకం లేదా, ఎమ్మెల్యేల కంటే కమిటీలకు పెద్దపీట వేస్తారా? అని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. అశోక్ మాట్లాడుతూ, సమావేశాలు జరగాలనే ఆశ ఉంది.
అయితే ప్రభుత్వం గ్యారెంటీ కమిటీలను రద్దు చేయాలి. ప్రభుత్వ ని«ధులను దురి్వనియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గట్టిగా నినాదాలు చేయడంతో కోలాహలం నెలకొంది. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 1.45 వరకు వాయిదా వేశారు. తరువాత సౌధ ఆవరణలో కెంగెల్ హనుమంతయ్య విగ్రహం ముందు ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment