చెరువు కట్టపై నాగుపాము
సాక్షి, బి.కొత్తకోట: ఓ నాగుపాము అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పెద్ద చెరువు కట్టపై తిష్టవేసింది. ఎక్కడికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ అక్కడికే వస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది. పది రోజుల క్రితం 4 అడుగుల నాగుపామును పెద్దచెరువు కట్టపై రోడ్డు పక్కన (ఆయకట్టు భూములున్న చోట) స్థానికులు చూశారు. పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని ఎవరిదారిన వారు వెళుతూ వస్తున్నారు.
రెండు,మూడు రోజులు గడిచినా పాము అక్కడి నుంచి కదల్లేదు. గత ఆదివారం స్థానికులు పామును చెరువుకట్ట ఆయకట్టు భూమిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అంతటితో పాము కథ ముగిసిందని భావించారు. ఊహించని విధంగా పాము సోమవారం పెద్దచెరువు కట్టపైకి వచి్చంది. దీనిపై ఆసక్తి పెంచుకున్న స్థానికులు మళ్లీ కొంత దూరంలో పాముని వదిలిరాగా..కొన్ని గంటలకే మళ్లీ అది యధాస్థానంలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ పాము ఉదంతంపై ప్రచారం విస్తృతమైంది.
గురువారం స్థానికులు చెరువుకట్టపైకి క్యూ కట్టారు. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి పామును చూసి వెళ్తున్నారు. కట్టపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు శుక్రవారం సాయంత్రం పామును మళ్లీ కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. అయితే మళ్లీ మామూలే..గంటకల్లా పాము మళ్లీ తొలిసారి ఎక్కడికి వచ్చి ఉందో అక్కడికే వచ్చేసింది. విషయం తెలుసుకొన్న మహిళలు రాత్రి కట్టపైకి చేరుకుని పాముకు పాలుపెట్టి హారతులు పట్టి పూజలు చేశారు. పాము పడగపై కుంకుమ పెట్టారు. కొంతమంది పామును మెడలో వేసుకుని విన్యాసాలు చేస్తున్నారు.
(చదవండి: పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి)
Comments
Please login to add a commentAdd a comment