
మైసూరు: నాగుపామును చూడగానే జడుసుకుని అంత దూరం పరిగెడతారు. కానీ వీరు మాత్రం దానికి వైద్యం చేశారు. పొలంలో మట్టిని నింపుతున్న సమయంలో హిటాచీ యంత్రంలో నాగుపాము తీవ్రంగా గాయపడింది. మైసూరు తాలూకాలోని వరగొడు గ్రామంలో ఓ పొలంలో పాము ఈ ప్రమాదంలో చిక్కుకుంది.
దీంతో హిటాచి వాహనం పామును జాగ్రత్తగా సంచిలో వేసుకుని మైసూరులోని పశువుల ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్. యశ్వంత్‌కుమార్ నాగుపామును పరిశీలించగా పలుచోట్ల పెద్ద గాయాలు కనిపించాయి. శస్త్రచికిత్స ద్వారా 24 కుట్లు వేసి మందు అంటించాడు. తరువాత దూరంగా అడవిలో వదిలేశారు.