ayakattu
-
అధ్వానంగా ఎత్తిపోతల పథకం
నడిగూడెం: మండల కేంద్రం సమీపాన ఉన్న సాగర్ ఎడమ కాల్వకు అనుబంధంగా ఉన్న ఎల్–34 ఎత్తిపోతల పథకం అధ్వానంగా మారింది. మోటార్లు పని చేయడం లేదు. పైపులైన్లు దెబ్బతిన్నాయి. మేజర్, మైనర్ కాల్వలు పలుచోట్ల పూడి, కంప చెట్లమయంగా మారాయి. దీంతో చివరి భూములకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ పథకం కింద నడిగూడెం పరిధిలో దాదాపు 100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది నీటి పారుదల శాఖ కింద అత్యవసర మరమ్మతుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు చేసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పనులు చేపట్టలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
ఎంత దూరంలో వదిలిపెట్టినా!..మళ్లీ గంటలో ప్రత్యక్షమవుతున్న పాము
సాక్షి, బి.కొత్తకోట: ఓ నాగుపాము అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పెద్ద చెరువు కట్టపై తిష్టవేసింది. ఎక్కడికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ అక్కడికే వస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది. పది రోజుల క్రితం 4 అడుగుల నాగుపామును పెద్దచెరువు కట్టపై రోడ్డు పక్కన (ఆయకట్టు భూములున్న చోట) స్థానికులు చూశారు. పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని ఎవరిదారిన వారు వెళుతూ వస్తున్నారు. రెండు,మూడు రోజులు గడిచినా పాము అక్కడి నుంచి కదల్లేదు. గత ఆదివారం స్థానికులు పామును చెరువుకట్ట ఆయకట్టు భూమిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అంతటితో పాము కథ ముగిసిందని భావించారు. ఊహించని విధంగా పాము సోమవారం పెద్దచెరువు కట్టపైకి వచి్చంది. దీనిపై ఆసక్తి పెంచుకున్న స్థానికులు మళ్లీ కొంత దూరంలో పాముని వదిలిరాగా..కొన్ని గంటలకే మళ్లీ అది యధాస్థానంలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ పాము ఉదంతంపై ప్రచారం విస్తృతమైంది. గురువారం స్థానికులు చెరువుకట్టపైకి క్యూ కట్టారు. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి పామును చూసి వెళ్తున్నారు. కట్టపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు శుక్రవారం సాయంత్రం పామును మళ్లీ కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. అయితే మళ్లీ మామూలే..గంటకల్లా పాము మళ్లీ తొలిసారి ఎక్కడికి వచ్చి ఉందో అక్కడికే వచ్చేసింది. విషయం తెలుసుకొన్న మహిళలు రాత్రి కట్టపైకి చేరుకుని పాముకు పాలుపెట్టి హారతులు పట్టి పూజలు చేశారు. పాము పడగపై కుంకుమ పెట్టారు. కొంతమంది పామును మెడలో వేసుకుని విన్యాసాలు చేస్తున్నారు. (చదవండి: పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
బాబు పాలనలో 'ఆయ'కట్
ఉరవకొండ: చంద్రబాబు పాలనలో హంద్రీనీవా పరిధిలోని ఆయకట్టుకు నీరు రాకుండా పోయిందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. అసలు ఆయకట్టుకు నీరివ్వాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేనట్టుందని దుయ్యబట్టారు. హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ‘జల సంకల్ప యాత్ర’ పేరిట విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం నింబగల్లుకు చేరింది. సర్పంచ్ వరలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకులు హనుమప్ప, చిదంబరి, రమేష్, ఈశ్వర్, వెంకటేష్, ఓబుళప్ప, శివరాజ్ తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ మండల కన్వీనర్ వెలిగొండ నరసింహులు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మార్చినాటికి హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని విరుచుకుపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని గతంలో అనేక దీక్షలతో పాటు స్వయంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉరవకొండలో ధర్నాకు దిగినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మాకు హక్కుగా ఇవ్వాల్సిన నీటిని ఒక నాయకుడు తాడిపత్రి, మరొకరు బుక్కపట్నం, ధర్మవరానికి తీసుకెళితే మేము చూస్తు ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే కరువు పీడిత అనంతపురం జిల్లాలోని 3.50లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో యువనేత నిఖిల్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కిసాన్‌సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, రైతు విభాగం రాయలసీమ జిల్లాల కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు నారాయణరెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి, వైఎస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కె.వి.రమణ, రైతు సంఘం నాయకులు రాజారాం, నరేంద్రబాబు, బీసీ సెల్ నాయకులు అనిల్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఆయకట్టుకు నీరెక్కడ బాబూ?
వజ్రకరూరు: హంద్రీ–నీవా మొదటి దశ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండానే జలహారతులంటూ ఆర్భాటాలకు పోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించే విషయంపై రైతులకు స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ జిల్లాలో కాలు పెట్టాలని సూచించారు. మండలంలోని వెంకటాంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. కాలనీలోని ప్రతి ఇంటికీ విశ్వ వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావం వల్ల పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అంతులేని వివక్ష చూపుతున్నారన్నారు. కనీసం రెండు తడులైనా నీళ్లు ఇచ్చి ఉంటే కోట్ల రూపాయల విలువైన పంట చేతికి వచ్చి ఉండేదని అన్నారు. పంట నష్టాలకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. హంద్రీ–నీవా పనులు పూర్తి చేయడంలోనూ సీఎం వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో రూ. 6వేల కోట్ల వ్యయాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ–నీవాకు రూ. 5,500 కోట్లు కేటాయించి, 90 శాతం పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే ప్రాజెక్ట్‌కు శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. అంతేకాక 40 టీఎంసీ ప్రాజెక్ట్‌ని ఐదు టీఎంసీలకు కుదించేందుకు కారకులయ్యారని విమర్శించారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే కృష్ణ జలాలపై ఇప్పటిలా మిగులు జలాలు కాకుండా జిల్లా రైతులకు సంపూర్ణ హక్కు ఉండేదని పేర్కొన్నారు. 10 శాతం పనులు చేయలేక.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌లోని 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంతటితో ఆగకుండా జీవో 22ని అమలు చేయడం ద్వారా హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థని రద్దు చేశారని తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులే సొంత ఖర్చుతో పైప్‌లు ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని మళ్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేని సీఎం రైతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. మొదటి దశ పనులు 2012లోనే పూర్తి చేసుకున్న హంద్రీ–నీవా ఆయకట్టుకు నేటికీ చుక్క నీటిని సీఎం అందించలేకపోయారని గుర్తు చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారుతులు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండ నియోజకర్గంలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -
ఆశలు బీడు..
మడకశిర: కర్ణాటక సరిహద్దులోని మడకశిర నియోజకవర్గం ఎత్తయిన ప్రదేశంలో ఉండటంతో వర్షం నీరు దిగువ కర్ణాటకలోని చెరువుల్లోకి చేరుతోంది. భారీ వర్షపాతం నమోదయినా ఇక్కడి చెరువుల్లో చుక్కనీరు నిలవడం కూడా గగనమవుతోంది. ఫలితంగా ఆయకట్టు బీడువారుతోంది. మొత్తం 46 మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిధిలో 13,769 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులు నిండని పరిస్థితుల్లో యేటా సగం ఆయకట్టు కూడా సాగయ్యే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ కారణంగా రైతుల బతుకు భారమవుతోంది. వర్షం నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చిన్న నీటి పథకాలే శరణ్యం. ఇందులో భాగంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో రెండు చిన్న నీటి పథకాలను మంజూరు చేశారు. ఇందులో ఒకటి నాచేపల్లి సప్లయ్ చానల్.. కాగా మరొకటి తమ్మడేపల్లి సప్లయ్ చానల్. 2006లోనే ఈ రెండింటికీ కలిపి రూ.2కోట్ల నిధులు మంజూరు చేశారు. అయితే ఆయన మరణానంతరం పాలక ప్రభుత్వాలు వీటిని పూర్తిగా విస్మరించడంతో నిధులు మురిగిపోయాయి. తమ్మడేపల్లి.. = అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి సమీపంలో ఈ చానల్‌ను నిర్మించాల్సి ఉంది. = కర్ణాటకలోని క్యాదిగుంట చెరువుకు వెళ్లే వర్షపు నీటిని తమ్మడేపల్లి చెరువులోకి మళ్లించే అవకాశం ఉంటుంది. = దాదాపు 600 ఎకరాలు సాగులోకి వస్తాయి. = భూగర్భ జలమట్టం పెరుగుతుంది. = దాదాపు 1000 వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పెరిగి మరో 500 ఎకరాలు సాగులోకి వస్తాయి. నాచేపల్లి.. = గుడిబండ మండలంలోని నాచేపల్లి వద్ద సప్లయ్ చానల్ నిర్మిస్తే వర్షపు నీటిని కర్ణాటకకు వెళ్లకుండా సద్వినియోగం చేసుకునే వీలుంది. = ప్రస్తుతం మడకశిర నియోజకవర్గంలోనే మోరుబాగల్ చెరువు అతిపెద్దది. ఈ చెరువు నిండి మరువ పడితే నీరంతా కర్ణాటకలోని బాణిగెర చెరువుకు చేరుతోంది. = ఈ నీటిని సప్లయ్ చానల్ ద్వారా నాచేపల్లి, హేమావతి చెరువుల్లోకి మళ్లిస్తే దాదాపు 750 ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుంది. కార్యరూపం దాల్చని గంగులవాయిపాళ్యం వాగు మళ్లింపు మడకశిర మండలంలోని గంగులవాయిపాళ్యం వాగును మడకశిర చెరువులోకి మళ్లించే ప్రతిపాదన ఇంత వరకు కార్యరూపం దాల్చని పరిస్థితి. ఈ వాగులో ప్రవహించే మొత్తం వర్షపు నీరంతా కర్ణాటకలోని బిదురుకెర చెరువుకి చేరుతోంది. ఈ వాగును మడకశిర చెరువులోకి మళ్లిస్తే దాదాపు 1000 ఎకరాలు సాగులోకి వస్తాయి. అంతే కాకుండా మడకశిర పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారుతోంది. ఫైళ్లను పరిశీలిస్తాం సప్లయ్ చానళ్ల విషయమై ఫైళ్లను పరిశీలించాల్సి ఉంది. ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చర్చించాలి. ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తాం. అధికారులతోనూ ఈ విషయమై చర్చిస్తాం. – మక్బుల్ సాహెబ్, జలవనరుల శాఖ ఎస్ఈ పొలం బీడు పెట్టుకుంటున్నా తమ్మడేపల్లి చెరువు కింద నాకు ఐదెకరాల భూమి ఉంది. సాగునీరు లేకపోవడంతో ఏనాడు కూడా పూర్తి స్థాయిలో సాగు చేయలేకపోయా. భారీ వర్షం కురిసినా ఇక్కడి చెరువు నిండని పరిస్థితి. వర్షం నీరంతా కర్ణాటక ప్రాంతంలోని చెరువుకు చేరుతోంది. యేటా పొలం బీడు పెట్టుకోవాల్సి వస్తోంది. జీవనం భారమవుతోంది. – సదానందగౌడ, రైతు, తమ్మడేపల్లి, అమరాపురం మండలం -
హంద్రీనీవా.. కన్నీటి తోవ
♦ ఇప్పటికే 2015లో జీఓ జారీ ♦ తెరపైకి లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ ♦ ఉరవకొండలో 20వేల హెక్టార్లకు రూ.899 కోట్లు కేటాయింపు ♦ ఇందులో 50 శాతం నిధులతో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయ్యే అవకాశం ♦ ప్రభుత్వ తీరుతో గందరగోళం రాష్ట్ర ప్రభుత్వం అనంత రైతును దగా చేస్తోంది. హంద్రీనీవా ఆయకట్టుకు ఏడాదిలో నీరిస్తామని 2014లో హామీ.. ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు తీయొద్దని 2015లో జీఓ.. 2016 ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్ఈ, సీఈలతో ప్రకటన.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి భూమి సమతులంగా లేదని.. లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నామని కొత్త పల్లవి. మొత్తంగా రూ.899 కోట్లకు ‘టెండర్’ పెడుతూ అస్మదీయులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. ఐదేళ్లుగా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చే వీలుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో హంద్రీనీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించారు. 2015 ఫిబ్రవరిలో కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 33, 34 ప్యాకేజీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఈపీఐఎల్(ఇంజినీరింగ్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్), 34ను ఆర్‌వీసీపీఎల్(రెడ్డివీరన్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువ తవ్వి.. ఆ పరిధిలో ఉప, పిల్ల కాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. అయితే పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కారణమేంటని ఆరా తీస్తే.. 5–6 కిలోమీటర్ మధ్య రాయి ఉంది. బ్లాస్టింగ్ చేయాలని అధికారులు చెప్పగా.. దీన్ని పక్కనపెట్టడంతో పాటు మేజర్ కెనాల్‌లోని కల్వర్టులను కూడా పూర్తి చేయని పరిస్థితి. ఈ పనులకు రూ.12కోట్లు ఇచ్చారని, 2004–05 రేట్ల ప్రకారం ఉండటంతో ఏజెన్సీ పనులు చేయకుండా వెనుదిరిగిందని అధికారులు మరోమాట చెప్పారు. 34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. ఇందులో డీ–1, 8.25, డీ–2. 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులకు బ్రేక్ పడింది. ఇదేమంటే 33 ప్యాకేజీలాగే పాతరేట్లు అని కొర్రీ పెడుతున్నారు. నిజానికి కొత్తరేట్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కాబట్టి పనులు చేస్తే ఏజెన్సీలకు ఎలాంటి నష్టం రాదు.. లాభం తప్ప. వీటితో పాటు 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336కోట్లు కేటాయిస్తూ దీనికి గతేడాది ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సమతులం పేరుతో డిస్ట్రిబ్యూటరీలను తప్పించే ఎత్తుగడ ఉరవకొండ నియోజకవర్గంలో కమ్యూనిటీ లిఫ్ట్, డ్రిప్ ఇరిగేషన్(సీఎల్ఐడీ) పథకం పేరుతో రూ.899కోట్లు కేటాయిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ ప్యాకేజీల్లో భూభాగం సమతులంగా లేకపోవడంతో 11,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొందని, అందుకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంది. అంటే ఈ ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు చేయమని చెప్పకనే చెప్పినట్లయింది. అలాగే ఈ ఆయకట్టుకు నీరిందంచడానికి కేటాయించిన 1.45టీఎంసీలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు చేయడం వల్ల మిగిలే 0.24 టీఎంసీలు కలిపి 1.69టీఎంసీలతో 20వేల హెక్టార్లకు అందిస్తామని పేర్కొంది. ‘ఆలీ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు.. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు.. నీళ్లు ఇవ్వలేదు.. అప్పుడే 0.24 టీఎంసీలు మిగిలాయని ప్రభుత్వం ఎలా చెబుతుందో అంతుపట్టని పరిస్థితి. జీఓలో పేర్కొన్న అంశాలు, 33, 34 ప్యాకేజీల పురోగతి పరిశీలిస్తే డిస్ట్రిబ్యూటరీలను పక్కనపెట్టినట్టే అనేది సుస్పష్టమవుతోంది. ఆయకట్టు స్థిరీకరిస్తేనే నీటిపై హక్కు ఫేజ్–1లో 1.18 లక్షల ఎకరాలకు హంద్రీ–నీవాపై హక్కు రావాలంటే డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేసి ఆయకట్టును స్థిరీకరించాలి. అప్పుడే ఈ నీటిపై రైతులకు హక్కు వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్, డ్రిప్ అంటూ డిస్ట్రిబ్యూటరీని పక్కనపెడితే ఆయకట్టు స్థిరీకరణ జరగదు. దీంతో నీటిపై రైతులు హక్కును కోల్పోతారు. పైగా లిఫ్ట్ కమ్ డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.899కోట్లు కేటాయించారు. ఫేజ్–1లో పూర్తిగా డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసినా అందులో 50శాతం నిధులు కూడా ఖర్చు కావు. ‘అనంత’లో సాగునీరు అందక, ఏటా రైతులు ఆత్మహత్యలకు ఉపక్రమిస్తున్నా ప్రభుత్వం మాత్రం మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
చుట్టూ చెరువులు.. చేలు కుదేలు
నిడమర్రు : నిడమర్రు బాడవ ఆయకట్టులోని 250 ఎకరాల్లో ఖరీఫ్ వరినాట్లు పడలేదు. ఆ పొలాల చుట్టూ చేపల చెరువులు విస్తరించడమే ఇందుకు కారణమైంది. పొలాల్ని కౌలుకు పొలం ఇద్దామన్నా సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. చేపల చెరువుల తవ్వకానికి అనుమతుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో సరిహద్దు రైతులు నష్టపోతున్నారు. పొలాన్ని చెరువు తవ్వుకునేందుకు అనుమతి మంజూరు చేసేప్పుడు జీవో నంబర్ 7 ప్రకారం సరిహద్దు రైతుల అభ్యంతరాలు పరిగణలో తీసుకోవాలి. చెరువు చుట్టూ బోదె నిర్మించాలి. ఈ బోదె గట్టుకు వరి పొలం గట్టుకు మధ్య దూరం 3 మీటర్లు ఉండాలి. రొయ్యల సాగుకు ఎటువంటి అనుమతి లేదు. ఈ విషయాలు పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు అనుమతులు లభిస్తున్నాయని రైతులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులే బాడవ ఆయకట్టుకు ముప్పు తెచ్చాయి. ఈ ఆయకట్టులో సుమారు 400 ఎకరాల్లో వరి పొలాలు ఉన్నాయి. ఆయకట్టుకు పడమరవైపు చేపల చెరువులు తవ్వేశారు. తూర్పు వైపు ఏలూరు రోడ్డు వద్ద చెరువులు తవ్వేందుకు అనుమతుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 32 మంది సరిహద్దు రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కలెక్టర్‌ను కలిసి చుట్టూ చెరువులు విస్తరిస్తే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లేం దుకు మార్గం ఉండదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామన్న మత్స్యశాఖ అధికారులు స్పందించలేదు. మే నెలలో 2 ఎకరాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఐదు రోజుల్లో అక్కడ చెరువులు తవ్వి బోర్లు వేసి రొయ్యల సాగు ప్రారంభించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.