Kottapet
-
ఎంత దూరంలో వదిలిపెట్టినా!..మళ్లీ గంటలో ప్రత్యక్షమవుతున్న పాము
సాక్షి, బి.కొత్తకోట: ఓ నాగుపాము అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పెద్ద చెరువు కట్టపై తిష్టవేసింది. ఎక్కడికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ అక్కడికే వస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ పాము స్థానికుల నుంచి పూజలు అందుకుంటోంది. పది రోజుల క్రితం 4 అడుగుల నాగుపామును పెద్దచెరువు కట్టపై రోడ్డు పక్కన (ఆయకట్టు భూములున్న చోట) స్థానికులు చూశారు. పాము అక్కడి నుంచి వెళ్లిపోతుందని ఎవరిదారిన వారు వెళుతూ వస్తున్నారు. రెండు,మూడు రోజులు గడిచినా పాము అక్కడి నుంచి కదల్లేదు. గత ఆదివారం స్థానికులు పామును చెరువుకట్ట ఆయకట్టు భూమిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అంతటితో పాము కథ ముగిసిందని భావించారు. ఊహించని విధంగా పాము సోమవారం పెద్దచెరువు కట్టపైకి వచి్చంది. దీనిపై ఆసక్తి పెంచుకున్న స్థానికులు మళ్లీ కొంత దూరంలో పాముని వదిలిరాగా..కొన్ని గంటలకే మళ్లీ అది యధాస్థానంలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఈ పాము ఉదంతంపై ప్రచారం విస్తృతమైంది. గురువారం స్థానికులు చెరువుకట్టపైకి క్యూ కట్టారు. వందల సంఖ్యలో ప్రజలు వచ్చి పామును చూసి వెళ్తున్నారు. కట్టపై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని స్థానికులు శుక్రవారం సాయంత్రం పామును మళ్లీ కొంత దూరం తీసుకెళ్లి వదిలేశారు. అయితే మళ్లీ మామూలే..గంటకల్లా పాము మళ్లీ తొలిసారి ఎక్కడికి వచ్చి ఉందో అక్కడికే వచ్చేసింది. విషయం తెలుసుకొన్న మహిళలు రాత్రి కట్టపైకి చేరుకుని పాముకు పాలుపెట్టి హారతులు పట్టి పూజలు చేశారు. పాము పడగపై కుంకుమ పెట్టారు. కొంతమంది పామును మెడలో వేసుకుని విన్యాసాలు చేస్తున్నారు. (చదవండి: పాపను కాపాడబోయి.. జిల్లా హాకీ కార్యదర్శి గిరి మృతి) -
Photo Feature: కరోనా వేళ.. గుంపులుగా జనాలు
జనాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ భౌతిక దూరం అనే మాటను మరిచారు. కోవిడ్ సెకండ్‌వేవ్ వణికిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఇలా వ్యవహరిస్తే ప్రమాదమనే విషయం వీరికి పట్టడం లేదు. ఆదివారం హైదరాబాద్ కొత్తపేట రైతుబజార్లో ఈ దృశ్యం కనిపించింది. -
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కరోనా పాజిటివ్
సాక్షి, తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎమ్మెల్యేకి కరోన సోకింది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ప్రస్తుతానికి ఆయన హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గిరెడ్డి తెలిపారు. నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. -
పడకేసిన పలివెల
కొత్తపేట, న్యూస్‌లైన్ : అపరిశుభ్రత కారణంగా మండలంలోని పలివెలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధాన గ్రామంతో పాటు శివారు ప్రాంతాల్లో సుమారు 50 మంది విషజ్వరాలతో మంచం పట్టారు. పలివెల, శేరేపాలెం, పెదపేట, చిన్నపేట, దేవాలయం వీధి, గుబ్బల వారిపాలెం, సత్యానందరావు కాలనీ తదితర ప్రాంతాల్లో మూడు వారాలుగా జ్వరంతో బాధపడుతున్న బాధితులు స్థానిక ప్రైవేట్ వైద్యుల వద్ద చికిత్స పొందారు. జ్వరం తగ్గకపోవడంతో కొత్తపేట, రావులపాలెం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. నెల రోజుల క్రితం సుమారు 20 మంది విష జ్వరాల బారిన పడగా, కొందరికి ప్లేట్లెట్ల కౌంట్ తగ్గడంతో, రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. తగ్గిన ప్లేట్లెట్ల సంఖ్య తాజాగా మర్గాన గంగాధరరావు విష జ్వరం బారిన పడగా, అతడి ప్లేట్లెట్ల కౌంట్ 26 వేలకు పడిపోయింది. దీంతో అతడు రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే పిడపర్తి రవి, తులా శ్రీనివాస్, అతడి భార్య రామతులసి విష జ్వరంతో బాధపడుతున్నారు. వీరికి 30 వేల నుంచి 20 వేలకు మధ్య ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయింది. రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది, తిరిగొచ్చారు. అలాగే తులా రాంబాబుకు ప్లేట్లెట్ల సంఖ్య 15 వేలకు తగ్గడంతో శుక్రవారం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. ముసిని లక్ష్మి , భమిడిపాటి దుర్గా లక్ష్మీనారాయణ, సిద్దా నాగమణి, సిద్దా లక్ష్మణరావు , సిద్దా శ్రీను కూడా విషజ్వరాల బారినపడి, రాజమండ్రిలో చికిత్స పొంది, కోలుకుంటున్నారు. గొలకోటి కనకలక్ష్మి, మల్లవరపు పోలమ్మ 10 రోజులుగా జ్వరం బారినపడి, స్థానికంగా చికిత్స పొందుతున్నారు. అలాగే మల్లవరపు సత్యనారాయణ, వెంకటేష్, సత్యానందం సుమారు 10 రోజులుగా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెండ్యాల భాస్కరరావు అనే వృద్ధుడు విష జ్వరంతో మంచానపడ్డాడు. దాదాపు ప్రతి ఇంటా.. వివిధ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంటికి ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామాల్లో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాలకు కారణమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విష జ్వరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు వ్యాధులతో అల్లాడుతుంటే పీహెచ్సీ అధికారులు ఆయా గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. దీనిపై అవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎస్. ఛాయాప్రసన్నను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, గ్రామంలో కొందరు వైరల్ జ్వరాలతో బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. వైద్య సిబ్బందితో రక్త నమూనాలు సేకరించి, మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కొంతమందికి చికిత్స చేయగా, మరికొందరు రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెప్పారు. -

ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
కొత్తపేట, న్యూస్‌లైన్ : ఓ ఇంట్లో దాక్కుని ఉన్న, దుండగులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను మండలంలోని వాడపాలెం గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీహార్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లల్లో దోపిడీకి వాడే మారణాయుధాలు, కారం, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఇళ్లల్లో దోపిడీకి మాటు వేశారా లేక ఎవరినైనా హతమార్చేందుకు ప్రణాళికతో వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాసాలు, జన సంచారం ఎక్కువగా ఉండే వాడపాలెం దుర్గమ్మ గుడి సమీపంలో సత్యవరపు శివయ్య పెంకుటింట్లో ఓ గదిని అదే గ్రామానికి చెందిన బండారు ధనరాజు అద్దెకు తీసుకున్నాడు. అందులో పొగాకు చట్టలు వేసుకుంటున్నారు. పది రోజులకు ఓసారి కావాల్సిన పొగాకు తీసుకుని, ఆ గదికి తాళం వేస్తాడు. మంగళవారం ఉదయం ధనరాజు కుమారుడు చిట్టబ్బాయి ఆ గది తలుపు తీసి లోనికి ప్రవేశించగా, అందులో ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వారిని చూసి కంగారు పడిన చిట్టబ్బాయి తలుపు వేసి స్థానికులను పిలిచాడు. అందరూ అక్కడకు చేరుకుని, వారిద్దరినీ పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా.. పెదవి విప్పకపోవడంతో సమీపంలోని స్తంభానికి కట్టి స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు ఆధ్వర్యంలో వారిని విచారణ చేస్తున్నారు. వారి వద్ద రెండు కత్తులు, కొడవలి, రంపం బ్లేడ్లు, స్క్రూడ్రైవర్, గుణపంలా ఉన్న ఇనుప రాడ్, తాడు, కారం పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్యాగ్‌ను కనుగొన్నారు. ఇద్దరిలో ఒక్కరికి 45 ఏళ్లు, మరొకరికి 30 ఏళ్లుంటాయని స్థానికులు తెలిపారు. వారిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తొలుత వారు హిందీలో మాట్లాడగా, పోలీస్ స్టేషన్లో ఒకరు తెలుగులో మాట్లాడినట్టు సమాచారం. వారు మారుమూల గ్రామీణ ప్రాంతంలో మాటువేయడానికి కారణం ఏమిటి, వారి వెనుక ఇంకెంతమంది ఉన్నారు. వీరిని ఎవరు తీసుకొచ్చారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై సీఐ రామారావును విలేకరులు ప్రశ్నించగా, ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు.