జనాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ భౌతిక దూరం అనే మాటను మరిచారు. కోవిడ్ సెకండ్‌వేవ్ వణికిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా ఇలా వ్యవహరిస్తే ప్రమాదమనే విషయం వీరికి పట్టడం లేదు. ఆదివారం హైదరాబాద్ కొత్తపేట రైతుబజార్‌లో ఈ దృశ్యం కనిపించింది.
1/8
అటు కరోనా భయం.. ఇటు వేసవితాపం.. వెరసీ జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. నైట్ కర్ఫ్యూ అయినా పగలు సైతం అదే పరిస్థితిని తలపిస్తున్నాయి కొన్ని ప్రాంతాలు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని లిబర్టీ చౌరస్తా ఇలా నిర్మానుష్యంగా కనిపించింది.
2/8
శ్వాస సులభతరంగా ఉండేందుకు రెండు ప్రెజర్ ఎయిర్ ఫిల్టర్‌లతో తేలికపాటి తలపట్టీలతో రూపొందించిన ఈ మాస్క్ బాగుంది కదూ? రోజురోజుకు కరోనా విజృంభిస్తుండడంతో రక్షణ కవచాలుగా ఉపయోగించే మాస్క్‌లలో సైతం కొత్తరకం సేఫ్టీ మాస్క్‌లు ఇలా అందుబాటులోకి వస్తున్నాయి. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో సర్జన్ డాక్టర్ శ్రీవాణి.. ఈ త్రీఎం మీడియం ఎలాస్టోమెరిక్ హాఫ్ ఫేస్ మాస్క్‌ను ధరించి ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు.
3/8
ప్రకృతిని ఆస్వాదించాలే కానీ.. చూడడానికి ఎన్నో అందాలు దాగి ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది తలమడుగు మండలంలోని కొత్తూరు అటవీ ప్రాంతం. వేసవి కాలం కావడంతో చెట్లన్నీ ఎండిపోయి ఉంటే.. మరోపక్క ఇప్పుడే చిగురిస్తున్న లేత ఆకులతో అక్కడక్కడా పచ్చదనం ఇలా కనువిందు చేస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
4/8
శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు శనివారం శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ ఎం.మహేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. మాస్క్ ధారణ, భౌతికదూరం ఆవశ్యకత తెలియజేస్తూ ప్లకార్డులు చేతపట్టుకుని శ్రీకాకుళం పట్టణంలో డే అండ్ నైట్ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విస్తృత అవగాహన కల్పించారు.
5/8
సిరిసిల్ల జిల్లాలోని ఆ రెండు పల్లెలు మాత్రం వైరస్ కట్టడిలో ముందున్నాయి. కలసికట్టుగా గిరిజనులు కరోనాను ఊరి దరిదాపుల్లోకి రాకుండా కట్టడి చేశారు. రుద్రంగి మండలం వీరుని తండాలో ఆరుబయట చెట్ల నీడలో గిరిజనుల జీవనం
6/8
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు భారీ పెరగడంతో రోగుల కోసం జబల్‌పూర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్
7/8
ఢిల్లీలో ఆక్సిజన్ ఫిల్లింగ్ కేంద్రం వద్ద ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లతో వేచి ఉన్నకోవిడ్ బాధితుల బంధువులు
8/8
రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో కోవిడ్ టీకా కోసం వరసలో వేచి ఉన్న యువత
Comments
Please login to add a commentAdd a comment