
కోవిడ్ భయంతో హైదరాబాద్ నగరం నిర్మానుష్యంగా మారుతోంది. సెకండ్‌వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో జనం బయటకు రావడం తగ్గించేశారు. మరోవైపు పనులు దొరక్క వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతున్నారు.

కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో హైదరాబాదీలు రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ పగటిపూట కూడా బయటకు రావడం తగ్గించారు. జనల్లేక నిర్మానుష్యంగా మారిన గచ్చిబౌలి రహదారులను ఇక్కడ చూడొచ్చు.

పనులు దొరక్క.. లాక్‌డౌన్ పెడతారేమోననే భయంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇంటి బాట పట్టడం ఆగడం లేదు. రైల్వే రిజర్వేషన్లు, టిక్కెట్ల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట వందలాది మంది కార్మికులు నిరీక్షిస్తున్నారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా దుబ్బపల్లి గ్రామశివారులో ఊర్లోకి బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కాపలాకాస్తున్న స్థానికుడు

మేదరుని మేధా అటువంటిది.. వారి వై‘విద్య’ను చూసి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ప్లాస్టిక్ దెబ్బకు వెదురు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గినా.. వృత్తిని నమ్ముకుని అనేకమంది ఇంకా తట్టలు, బుట్టలు అల్లుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో వెదురు షేడ్స్ తయారు చేస్తున్నారు. విజయవాడ బిషప్ అజరయ్య స్కూల్ సమీపంలో షేడ్స్ తయారు చేస్తున్న కార్మికులను చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

శ్రీకాకుళం జిల్లా భామినిలో నింగికి రంగుల నిచ్చెన వేసినట్లు హరివిల్లు ఆవిష్కృతమైంది. సాయం సమయంలో చిరుజల్లులు పలకరించాక ఇలా మబ్బుల మాటున ఇంద్ర ధనస్సు కనిపించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

మూగజీవాలు ఎండ వేడిమికి అల్లాడుతున్నాయి. చుక్క నీరు దొరికినా చాలు గొంతు తడుపుకొంటున్నాయి. అలా కొళాయి నుంచి కారుతున్న నీటి చుక్కలతో ఓ బాతు దాహం తీర్చుకుంటున్న దృశ్యమిది. విశాఖ జిల్లా వనభసింగి పంచాయతీ కేంద్రంలో సాక్షి కెమెరాకు చిక్కింది.

మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన కొనసాగిస్తున్న రైతులకు మద్దతు తెలపడానికి పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి బయలుదేరిన రైతులు

కరోనా బాధితుల కోసం ఢిల్లీలో బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ప్రారంభించిన ఆటో–అంబులెన్స్‌లు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సిక్కు మత సంస్థ అందజేసిన ఉచిత ఆక్సిజన్‌తో ఆసుపత్రిలో కోవిడ్–19 బాధిత బాలుడు
Comments
Please login to add a commentAdd a comment