
హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం జనం తండోప తండాలుగా తరలివస్తున్నారు. ఫీవర్ ఆస్పత్రిలో టీకా తీసుకునేందుకు వచ్చిన ఇద్దరు వయోవృద్ధులు ఇలా నిరీక్షిస్తూ కనిపించారు. ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వ్యాక్సినేషన్ కోసం జనం భారీగా తరలివచ్చారు. శుక్రవారం రాజేంద్రనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు వ్యక్తులు ఇలా పీపీఈ కిట్లు ధరించి మరీ వచ్చారు. ఆస్పత్రి వద్ద కరోనా అంటుకునే ప్రమాదం ఉందనే భావనతో పకడ్బందీ ఏర్పాట్లతో రావడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇటు వ్యాక్సినేషన్.. అటు కరోనా పరీక్షలు, చికిత్సలు.. ఈ విపత్కర పరిస్థితుల్లో అలుపెరుగకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యారోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.. అందుకు నిదర్శనమే ఈ చిత్రాలు.. శుక్రవారం ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు అన్నివైపుల నుంచి తమను చుట్టుముట్టడంతో దయచేసి.. ఒకరితర్వాత ఒకరు రావాలంటూ ఓ ఆశాకార్యకర్త ఇలా దండం పెడుతూ విజ్ఞప్తి చేశారు. ఇది జరిగిన కొంతసేపటికే.. అక్కడే విధులు నిర్వహిస్తున్న మరో ఆశాకార్యకర్త పని ఒత్తిడితో కళ్లు తిరిగిపడిపోయారు.. సపర్యల అనంతరం తేరుకున్నారు.

చేతులు జోడించి దండం పెడుతున్న ఈమె జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలంలోని రాగోజిగూడ సర్పంచ్ బాలసాని లహరిక. తమ గ్రామంలోకి ఇతరులెవరూ రావొద్దని ఆమె కోరుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కొద్ది రోజులు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరమైతే, అవసరాన్ని బట్టి నిబంధనలతో అనుమతి ఇస్తామని పేర్కొంటున్నారు.

ఆక్సిజన్ పెట్టుకుని.. హైదరాబాద్ కోఠి ఆస్పత్రి బయట అంబులెన్స్‌లో వేచి చూస్తున్న కరోనా రోగి..

హైదరాబాద్‌లోని చార్మినార్ యునానీ ఆస్పత్రిలో ఓ వృద్ధుడుకి కోవిడ్ టీకా ఇస్తున్న నర్సు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోవిడ్–19 ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఓ బాధితుడి ఫొటోలను ఫోన్‌లో వారి బంధువులకు పంపించే పనిలో నిమగ్నమైన ఆరోగ్య కార్యకర్త

కోవిడ్–19 బారినపడి మరణించిన వారి మృతదేహాలను ఢిల్లీలోని ఓల్డ్ సీమాపురి శ్మశాన వాటికలో దహనం చేస్తున్నారు. చితాభస్మం సేకరణ కోసం మృతుల బంధువులు ముందుకు రాకపోవడంతో షహీద్ భగత్‌సింగ్ సేవాదళ్ కార్యకర్తలే ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్న దృశ్యం

ఓ మహిళకు వైద్య సిబ్బంది కరోనా పరీక్ష చేస్తున్న దృశ్యం ఓ బైక్ అద్దంలో ఇలా ప్రతిబింబించింది
Comments
Please login to add a commentAdd a comment