
పడగవిప్పిన పాము
కడప , ఓబులవారిపల్లె : స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం రాత్రి నాగుపాము కనిపించింది. స్టేషన్ బయట ఉన్న మరుగుదొడ్డి పక్కనే శబ్దం రావడంతో అటువైపు వెళుతున్న కానిస్టేబుల్ అమర్ చూశాడు. ఆయన గమనించి తోటి సిబ్బందికి తెలిపాడు. పాము పడగవిప్పి బుసలు కొడుతుండటం, రాత్రి కావడంతో దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయలేదు.
రెండు గంటల సేపు అలాగే ఉన్న పాము పక్కనే ఉన్న వాహనాల్లోకి వెళ్లింది. పట్టుబడ్డ వాహనాలను రైల్వేకోడూరు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారు పోలీసు క్వార్టర్స్‌లో ఉంచారు. అవి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరాయి. పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. విషసర్పాలకు అడ్డాగా మారాయి. తరచూ క్వార్టర్స్‌లోకి వస్తుండటంతో పోలీసు కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాహనాలను మరో చోటుకు తరలించాలని పోలీసులు కోరుతున్నారు.