
బంధించిన నాగుపామును చూపుతున్న పునీత్
రామనగర(దొడ్డబళ్లాపురం): కనకపుర పట్టణ పోలీసులకు చెమటలు పట్టించిన నాగుపాము ఎట్టకేలకు పట్టుబడింది. రెండు రోజుల క్రితం పెద్ద నాగుపాము ఒకటి పట్టణ పోలీస్ స్టేషన్ కాంపౌండ్‌లో, స్టేషన్‌లోపల తిరుగుతూ సిబ్బందికి చెమటలుపట్టించింది. చివరకు కాంపౌండ్‌లోని చిన్న కలుగులో దూరింది. అప్పుడప్పపుడూ వచ్చి కనిపించి వెళ్తోంది. దీంతో పోలీసులు శుక్రవారం పాములు పట్టే పునీత్ అనే వ్యక్తిని రప్పించారు. అతను చాకచక్యంగా పామును బంధించాడు. పామును శివనహళ్లి సమీపంలోని అడవిలో వదిలేస్తామని పునీత్ తెలిపాడు.