
పామును పట్టుకున్న అగ్నిమాపక సిబ్బంది
సాక్షి, తిరుత్తణి : బ్యాంకులో చొరబడిన నాగుపాము హల్‌చల్ రేపింది. దీంతో ఖాతాదారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తిరుత్తణిలో మంగళవారం చోటుచేసుకుంది. తిరుత్తణి బస్టాండుకు సమీపంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖాతాదారులు వేచివున్న సమయంలో బ్యాంకు ముందు భాగంలోని నీటి ట్యాంకు నుంచి దాదాపు మూడు అడుగుల పొడవున్న నాగుపాము బ్యాంకులోకి ప్రవేశించడాన్ని గుర్తించిన ఖాతాదారులు కేకలు వేస్తూ భయంతో పరుగులు తీసారు. బ్యాంకు సిబ్బంది సైతం ఆందోళన చెందారు. ఇంతలో అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారంతో బ్యాంకు వద్దకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది దాదాపు అర్ధగంట పాటు శ్రమించి పామును పట్టుకోవడంతో వినియోగదారులు, బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment