శివమొగ్గ(కర్ణాటక): ఓ వ్యక్తి ‘షూ’ లోపల నాగుపాము పడకేసింది. ‘షూ’ వేసుకుందామని కదిలించేసరికి.. బుసకొడుతూ బెంబేలెత్తించింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ శివారులోని బొమ్మానకట్టెలో మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మానకట్టెకు చెందిన మంజప్ప మంగళవారం ఉదయం ఇంటి బయట ఉంచిన షూ వేసుకోవడానికి ప్రయత్నించగా.. ఒక్కసారిగా నాగుపాము బుసలు కొట్టింది.
చదవండి: వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక..
దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగు తీశారు. దీని గురించి స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న కిరణ్.. పామును జాగ్రత్తగా బయటకు తీసి గ్రామానికి దూరంగా తీసుకెళ్లి వదిలివేశాడు. వర్షాకాలంలో షూ వేసుకునేముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని స్నేక్ కిరణ్ సూచించాడు.
Comments
Please login to add a commentAdd a comment