సాక్షి, ఖమ్మం జిల్లా: కూసుమంచిలోని కాకతీయుల కాలం నాటి శివాలయం లో ఓ నాగు పాము ప్రత్యక్ష మైంది. సోమవారం కావడంతో తెల్లవారు జామునే ఆలయ పూజారి శేషగిరి శర్మ.. శివునికి పూజలు చేసేందుకు గుడి తలుపులు తీశారు. అప్పటి వరకు శివలింగంపైన ఉన్న నాగుపాము కిందకు దిగి శివలింగం పక్కనే పడగ విప్పి ఉండటంతో అక్కడకు వచ్చిన భక్తులు అంతా శివుని మహిమే అంటూ నాగుపాముకు దండం పెట్టుకుని శివునికి పూజలు చేశారు. ఓ పావుగంట గర్భ గుడిలో ఉన్న నాగుపాము గుడిలో నుంచి బయటకు వచ్చింది.
చదవండి: అలా జరిగింది.. రూపాయితో 20 వేలు!
Comments
Please login to add a commentAdd a comment