Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్‌!!.. ఆగండి..! | Viral Video Woman Catches ​Huge Cobra With Bare Hands | Sakshi
Sakshi News home page

Cobra Viral Videos: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్‌!!.. ఆగండి..!

Published Tue, Nov 2 2021 2:11 PM | Last Updated on Tue, Nov 2 2021 4:14 PM

Viral Video Woman Catches ​Huge Cobra With Bare Hands - Sakshi

మీకు పాములంటే భయం లేదా.. ఐతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయం మార్చుకుంటారు. పెద్ద కోబ్రాను ఏమాత్రం జంకుబొంకు లేకుండా, అసలుతత్తరపాటే లేకుండా ఓ మహిళ ఒట్టిచేతులతోనే పట్టుకుందండీ! ఈ వీడియో చూస్తేనే గుండెకాయ గొంతులోకొచ్చినంత పనౌతుంది! ధైర్యముంటే.. మీరు చూడండి.

ఓ పాడుబడ్డ ఇంటిలో పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ కోబ్రాను ఒక మహిళ ఒట్టి చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చుట్టూ చూస్తున్న జనాలు భయంతో దూరంగా పారిపోగా ఆమె మాత్రం చాలా చాకచక్యంగా, ధైర్యంగా కోబ్రాను చేతులతో పట్టుకుని ఇంటి నుంచి బయటికి తెచ్చి, బయట రోడ్డు పక్కన వదిలిపెడుతుంది. ఐతే కోబ్రా మళ్లీ అదే ఇంటివైపు వెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె కోబ్రా తలను గట్టిగా పట్టుకుని గోనె సంచిలో వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం వీడియోలో కోబ్రా అనేక సార్లు సదరు మహిళపై దాడి చేయగా, ఆమె మాత్రం చాలా అలవోకగా దాని దాడి నుంచి తప్పించుకుంటుంది.

చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్‌ మైనింగ్‌! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!

నాలుగు నిముషాల నిడివిగల ఈ వీడియోను ‘అమేజింగ్ క్యాచ్ స్నేక్ బై హ్యాండ్’ క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్‌ అవుతోంది. ఆ మహిళ పాము పట్టే నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇక వేలల్లో లైకులు, విభిన్న కామెంట్లతో తిరిగి వార్తల్లో నిలిచింది. 

చిన్న పామును కిలోమీటరు దూరం నుంచి చూసినా.. నాకు హార్ట్‌ అటాక్‌ వస్తుందని ఒకరు, మృత్యువుతో ఆటలాడినందుకు ఆమెకు ఒలంపిక్‌ మెడల్‌ ఇవ్వాలని మరొకరు, ఈ క్యాచింగ్ స్టైల్ చాలా ప్రమాదకరమైనది. ఆమె అదృష్టం బాగుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దైర్యంగా ఉండటం మంచిదేకానీ విష సర్పాల జోలికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.

చదవండి: Viral Video: బాబోయ్‌..! చావును ముద్దాడాడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement