కార్తికేయుని సన్నిధిలో నాగుపాము
పావగడ : పావగడలోని నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న నవ గ్రహ విగ్రహాల వద్దకు ఓ నాగుపాము చేరుకుంది. వారం రోజులుగా అక్కడే ఉండిపోయింది. అత్యంత ప్రీతిపాత్రమైన నాగుపాము స్వామి వారి సన్నిధిలో ఉండడంతో ఆశ్చర్యానికి గురైన భక్తులు ఎంతో భక్తితో పూజలు చేస్తున్నారు. పాముకు ఆహారంగా పాలు పోసి కొలుస్తున్నారు. ఈ వింత సంఘటనను చూడటానికి చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు తరలి వస్తున్నారు. భక్తులు పామును వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా పాము కదలక పోవడం విశేషం.