నాగుపాము మృతి
పావగడ : నాగలమడక అంత్య సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన నాగుపాము ఆదివారం మృతి చెందింది. స్వామి సన్నిధిలో కొలువుదీరి సాక్షాత్తు శంకరుని మెడలోని నాగుపామే దిగి వచ్చి ఆలయంలో సాక్షాత్కరించిందా అనే విధంగా భక్తులకు దర్శనమిచ్చిన పాము చనిపోయింది. నాగుపామును దర్శించుకోవడానికి ఆదివారం ఉదయం తండోపతండాలుగా భక్తులు తరలివచ్చారు. అయితే పాము మృతి చెందిన వార్త విని శోకంలో మునిగిపోయారు. ఆ పాముకు ఆలయ ఆవరణలోని నాగులకట్ట వద్ద దహన సంస్కారాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు బదరీనాథ్ తెలిపారు.