ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం | Cobra Snake Hulchul infront of House in Karnataka | Sakshi
Sakshi News home page

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

Published Sat, Aug 3 2019 8:47 AM | Last Updated on Sat, Aug 3 2019 8:47 AM

Cobra Snake Hulchul infront of House in Karnataka - Sakshi

కర్ణాటక ,గంగావతి:  కారటగి తాలూకాలోని సిద్దాపుర గ్రామంలోని 7వ వార్డులో ఓ ఇంటి ముందు నాగుపాము ప్రత్యక్షమై సుమారు 3 గంటల పాటు అక్కడే పడగ విప్పి నిలవడం ఆశ్చర్యచకితులను చేసింది. భారీ స్థాయిలో ఉన్న నాగుపాము ఆ వార్డులో నివాసం ఉన్న బసేటప్ప నివాసం ముందు పడగ విప్పి అక్కడే నిలబడి ఉండటాన్ని ప్రజలు ఆశ్చర్యంగా తిలకించారు. ఈ పాముకు ముందు పాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నాగలచవితికి నాలుగు రోజుల ముందుగా నాగుపాము ఈ విధంగా దర్శనం ఇవ్వడం నాగదేవత అనుగ్రహం అని ప్రజలు భావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement