వనపర్తి: పట్టణంలోని కమలానగర్ కాలనీలో బుధవారం తెల్లని నాగుపాము(శ్వేతనాగు) కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సాగర్స్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు.
అరుదుగా కనిపించే తెల్ల నాగుపాము (శ్వేతనాగు)ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. సైన్స్ ప్రకారం తన్యులోపం వల్ల తెల్లని వర్ణంలో పాములు ఉంటాయని నిపుణులు తెలిపారు. శ్వేతనాగును అచ్చంపేట అటవి ప్రాంతంలో వదిలేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment