vanaparthi
-
Humera Begum: టీచర్ కొలువిచ్చిన సివిల్ పవర్
ఆమధ్య వచ్చిన కమల్‌హాసన్ సినిమాలో ఒక డైలాగ్....‘ఈ లోకంలో అత్యంత ధైర్యవంతులు ఎవరో తెలుసా? కోల్పోవడానికి ఏమీ మిగలని వాళ్లు!’ఒకప్పుడు హుమేరా బేగం పరిస్థితి అలాగే ఉండేది. సివిల్స్‌కు ఎంపిక కావాలనేది తన లక్ష్యం. ఆ లక్ష్యం వైపు అడుగులు పడకుండానే...‘మేమున్నాం’ అంటూ సమస్యలు, వాటితోపాటు వచ్చిన బాధలు వరుస కట్టాయి. ఇలాంటప్పుడు లక్ష్యం మసక మసకగా కనిపించడం మాట అటుంచి అసలే కనిపించకపోయే ప్రమాదం ఉండవచ్చు.‘కోల్పోవడానికి ఏమీ లేదు’ అనుకునే స్థితిలో ఉన్న తనకు భయం ఎందుకు! ఆ ధైర్యంతోనే సమస్యలను తట్టుకునే నిలబడింది. ఎస్జీటి ఉర్దూ టీచర్‌గా సెలెక్ట్ అయింది. మరి సివిల్స్ కల..? అంటారా... ‘వెయ్యి మైళ్ల ప్రయాణం అయినా, ఒక అడుగుతోనే ఆరంభం అవుతుంది’ అనే మాట మనకు తెలియనిది కాదు...హుమేరా బేగం స్వస్థలం తెలంగాణాలోని వనపర్తి. నాన్న రోజువారీ కూలీగా సైదాబాద్ (హైదరాబాద్)లో ఒక మదర్సాలో పని చేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంతకాలం పని చేసింది. అన్న ఓబిద్ మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది హుమేరా చిన్నప్పటి కల. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు కష్టాలు మొదలయ్యాయి.తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. ప్రైవేట్ స్కూల్ నుంచి చాదర్‌ఘట్‌లోని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. మరోవైపు తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తమకు దూరం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.‘నా తండ్రి వెయ్యి ఏనుగుల బలం’ అనుకునే అమ్మాయి ‘తండ్రి లేని బిడ్డ’ అయింది.తండ్రి చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగి వనపర్తి వెళ్లిపోయారు. హైదరాబాద్ విడిచి వెళుతున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘హైదరాబాద్ అంటే పెద్ద సిటీ... పెద్ద చదువులు చదువుకోవచ్చు’ అనుకునేది. ధైర్యం ఇచ్చే నాన్న లేడు. ధైర్యం ఇచ్చే మహా నగరం దూరం అయింది.అయితే తన కల మాత్రం దూరం కాకుండా జాగ్రత్త పడింది. హుమేరాలో చదువుకోవాలనే తపన చూసి అక్క (చిన్నమ్మ కూతురు) సమీన, కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బావ అహ్మద్ అలీ హుమేరా కుటుంబాన్ని మళ్లీ హైదరాబాద్ తీసుకువచ్చారు. పట్టుదల గట్టిదైతే ఒక్కో ద్వారం దానికదే తెరుచుకుంటూ దారి చూపుతుంది. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల, కల జైలు సూపరింటెండెంట్ వరకు వెళ్లింది. చంచల్‌గూడ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ తరఫున హుమేరాకు అండగా నిలబడ్డాడు. ‘మేము సైతం’ అన్నారు జైలు సిబ్బంది. తమ పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు హుమేరాకు అవకాశం ఇచ్చారు.జైలు అధికారులు, సిబ్బంది సహకారం హుమేరా కుటుంబానికి ఆర్థికంగా భరోసాను ఇచ్చాయి. ఆమెలో ఆత్మవిశ్వాస శక్తిని రెండింతలు చేశాయి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసింది. నేరేడ్మెట్లో డీఎడ్ కూడా పూర్తి చేసింది. కష్టపడే వారిని విజయం వెదుక్కుంటూ వస్తుంది... అన్నట్లు హుమేర కష్టం వృథా పోలేదు. ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయింది.ఒకప్పుడు... ‘ఐఏఎస్ కావాలనేది నా కల’ అని హుమేరా అని ఉంటే నవ్వేవాళ్లేమో. ఎందుకంటే తాను ఉన్న దయనీయమైన పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ పూర్తి చేయడమే చాలా కష్టం. ఇప్పుడు ఎవరూ ఎగతాళిగా నవ్వే పరిస్థితి లేదు. ‘యస్... ఆ అమ్మాయి కచ్చితంగా సాధిస్తుంది’ అంటారు ఇప్పుడు. ఈ నమ్మకం కలిగించడానికి ఆమె ఎంతో కష్టపడింది. గుండె ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. హుమేరాది ఎంతోమంది పేద అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపించే పట్టుదల. ఆమె భవిష్యత్ కల నెరవేరాలని బలంగా కోరుకుందాం.జీవితం ముగిసిపోయింది అనుకున్న సమయంలో....సివిల్స్ సాధించాలనే నా కలను దృష్టిలో పెట్టుకొని ‘సేవ్ ద గర్ల్ ఛైల్డ్’ సంస్థ సహకారంతో శివకుమార్ గౌడ్ సార్ నాకు దిల్లీకి చెందిన ఓ కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్ లైన్ సివిల్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఓపెన్ డిగ్రీతో పాటు, నా ట్యూషన్లు కొనసాగిస్తూనే మిగిలిన సమయంలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నా జీవితం ముగిసింది అనుకున్న సమయంలో ఒక దారి దొరికింది. నాలా అవకాశాల కోసం కష్టపడే ఎంతోమంది పేద విద్యార్థులకు అండగా నిలబడేందుకే నేను సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను.– హుమేరా బేగం – నాగోజు సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్ స్టేట్ బ్యూరో -
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
అరుదుగా కనిపించే శ్వేత నాగు.. చూసేందుకు ఎగబడ్డ జనం
వనపర్తి: పట్టణంలోని కమలానగర్ కాలనీలో బుధవారం తెల్లని నాగుపాము(శ్వేతనాగు) కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సాగర్స్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. అరుదుగా కనిపించే తెల్ల నాగుపాము (శ్వేతనాగు)ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. సైన్స్ ప్రకారం తన్యులోపం వల్ల తెల్లని వర్ణంలో పాములు ఉంటాయని నిపుణులు తెలిపారు. శ్వేతనాగును అచ్చంపేట అటవి ప్రాంతంలో వదిలేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. -
వనపర్తి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
వనపర్తి నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన మొదటి సారి గెలిచారు. 2014 నుంచి ఐదేళ్ళ తెలంగాణ ప్రణాళికా అభివృద్ది మండలి ఉపాద్యక్షుడుగా పనిచేసిన నిరంజన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి మంత్రి అయ్యారు. నిరంజన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిపై 51685 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కలిసి పనిచేసినా మహాకూటమి ఘోరంగా ఓడిపోవడం విశేషం. నిరంజన్‌రెడ్డికి 111956 ఓట్లు రాగా, చిన్నారెడ్డికి 60271 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసిన కె.అమరేందర్ రెడ్డికి మూడువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. నిరంజన్ రెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గం నేత. మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి వనపర్తిలో 2009లో ఓడిపోయినా, 2014లో విజయం సాధించారు. 2014లో ఆయన టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి నిరంజన్ రెడ్డిపై 3888 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఓటమి చెందారు. 45200 ఓట్లు తెచ్చుకుని ఈయన మూడోస్థానానికి పరిమితం అవ్వవలసి వచ్చింది. చిన్నారెడ్డి 1989, 1999, 2004,2014లలో గెలుపొందారు.2018లో ఓటమిచెందారు. రావుల చంధ్రశేఖర్‌రెడ్డి 1994లోను, తిరిగి 2009లో గెలిచారు. వనపర్తి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి పదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, ఒకసారి టిఆర్ఎస్, పి.ఎస్.పి ఒకసారి గెలు పొందాయి. 1957లో వనపర్తిలో పద్మనాభరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ నుంచి గెలుపొందారు. టిడిపి నేత డాక్టర్ ఎ.బాలకృష్ణయ్య రెండుసార్లు గెలిస్తే, జె. కుముదినిదేవి రెండుమార్లు గెలు పొందారు. రావుల చంధ్రశేఖర్ రెడ్డి ఛీప్విప్గా పనిచేయగా, 2002లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వనపర్తిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గం గెలు పొందితే, నాలుగుసార్లు బిసిలు గెలిచారు. చిన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్‌కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్‌టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
కాట్రావత్ శాంతకుమారి: తండా నుంచి థాయ్‌లాండ్‌కు
నాలుగోసారీ ఆడపిల్ల పుట్టింది. భారమవుతుందేమో అమ్మాలనుకుంటే అయిదొందలకు బేరమూ కుదిరింది. మళ్లీ వద్దనుకున్నారు అమ్మానాన్న. ఎంత కష్టమైనా తామే సాకాలనుకున్నారు. ఐదో క్లాసు నుంచే కూలిపనులకెళ్లింది. మిల్లులో కూలిపనుల కోసం సంచుల్లో తవుడు ఎత్తిన ఆ చేయి... ఇప్పుడు అంతర్జాతీయ ఆటస్థలాల్లో వాలీబాల్ ఎత్తుతోంది. బంతిని బాదినంత తేలిగ్గా బీదరికాన్నీ బాదడానికి ప్రయత్నిస్తోంది. నెట్ అవతలికి బంతిని పంపినట్టుగా తన నైపుణ్యాలను దేశం బయటా చూపుతోంది. ఎక్కడో గిరిజనతండాల్లో పుట్టిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపడానికి ఇప్పుడు మరోసారి సమాయత్తమవుతోంది. ఆల్ ద బెస్ట్... శాంతకుమారి. ఉమ్మడి పాలమూరులోని ప్రస్తుత వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పుతండాకు చెందిన క్రీడా ఆణిముత్యం కాట్రావత్ శాంతకుమారి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత వాలీబాల్ క్రీడలో మహిళల కేటగిరిలో జాతీయ జూనియర్ జట్టుకు ఎంపికైన మొట్టమొదటి బాలిక ఆమె. ఈ నెల ఆరు నుంచి 13వ తేదీ వరకు థాయిలాండ్‌లో జరిగిన 14వ ఏషియన్ వాలీబాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కపూట తిండికీ కష్టమే.. మా అమ్మ పేరు భామిని, నాన్న అమృనాయక్, మేము మొత్తం ఆరుగురు సంతానం. నాకు ముగ్గురు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు అయ్యాయి. మూడో అక్క మంజుల ఇంటర్ సెకండియర్, తమ్ముళ్లు కుమార్ తొమ్మిది, రాహుల్ ఏడో తరగతి చదువుతున్నారు. మా అమ్మానాన్న అందరినీ సమానంగా చూస్తారు. పెద్ద కుటుంబం కావడం.. అమ్మానాన్నలకు ఉపాధి దొరక్కపోవడంతో ఒక్క పూట తిండి కూడా కష్టమయ్యేది. మేమందరం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోనే చదువుతున్నాం. కరోనాకు ముందు వరకు అమ్మానాన్న ముంబాయికి వలస వెళ్లారు. కరోనా కాలంలో తిరిగి వచ్చాక ఉపాధి దొరకడం కష్టమైంది. ప్రస్తుతం హైదరాబాద్ షేక్‌పేట (నాలా)లో మేస్త్రీ వద్ద పనిచేస్తున్నారు. వారు కష్టం చేసి సంపాదించిన దాంతోపాటు అప్పులు చేసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు చేశారు. మిల్లులో కూలి పనులకు వెళ్లా.. నేను ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు చిట్యాల ప్రైమరీ స్కూల్లో చదువుకున్నా. ఐదు నుంచి పదో తరగతి వరకు మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు)లో చదువుతున్నా. నేను ఐదో తరగతి నుంచి మా అక్కలతో కలిసి సెలవు దినాల్లో కూలి పనులకు వెళ్లేదాన్ని. రైస్‌మిల్లులో సంచులు కుట్టడం, తవుడు ఎత్తడం వంటి పనులు చేశాను. పీడీ మేడం చొరవతో ... నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఎవరైనా ఆటలాడుతుంటే అక్కడే ఉండిపోయేదాన్ని. గురుకుల పాఠశాలకు వచ్చిన తర్వాత మా సీనియర్స్ ఖో ఖో అడుతుంటే.. ఒక్కొక్కరి ఆటను దగ్గరుండి గమనించేదాన్ని. ఒకరోజు మా పీడీ మేడమ్ అరుణారెడ్డి వచ్చి ‘ఏం చూస్తావ్.. నీవు ఆడవా’ అని అడిగారు. ఆ తర్వాత నుంచి మేడమ్‌తో మంచి చనువు ఏర్పడింది. మెల్లమెల్లగా నా దృష్టిని వాలీబాల్ వైపు మళ్లించారామె. ఉదయం ఐదు నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టేవారు. ఓటమితో మొదలు.. 2016లో మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మా జట్టు ఓడిపోయింది. ఆ తర్వాత ఆటపై మరింత దృష్టి సారించా. మహబూబ్‌నగర్‌లో అండర్ 14 విభాగంలో జరిగిన ఎస్జీఎఫ్ ఎంపికల్లో జిల్లా జట్టుకు ఎంపికయ్యా. ఆ తర్వాత భద్రాచలంలో అసోసియేషన్ మీట్ జరిగింది. ఇందులో సెలెక్ట్ కాలేకపోయా. నాలో నిరుత్సాహం అలుముకుంది. అక్కడి నుంచే మేడంకి ఫోన్ చేశా. ఇక నేను వాలీబాల్ ఆడనని! కానీ.. ఆమె నాకు ఎక్కడలేని ధైర్యాన్ని నూరిపోశారు. ఆమె సూచనతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. అప్పటి నుంచి నేను మానసికంగా బలంగా తయారయ్యా. మెళకువలు నేర్చుకున్నా. అనంతరం సబ్ జూనియర్స్ విభాగంలో రాష్ట్ర, జాతీయస్థాయి ఎంపికల్లో ప్రతిభ కనబరిచా. చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లాం. అలా టెన్నిస్, వాలీబాల్, బీచ్ వాలీబాల్‌తోపాటు రగ్బీ క్రీడలో సైతం రాణించా. అయితే కోవిడ్ విజృంభణతో రెండేళ్లుగా ఆటల పోటీలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో మా మేడమ్ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై ఆన్లైన్ ద్వారా క్లాస్ తీసుకునే వారు. వాలీబాల్ ఆట నుంచి నా దృష్టి మరలకుండా శిక్షణ ఇచ్చేవారు. పాస్‌పోర్టు ఇతరత్రా ఖర్చులు కూడా ఆమే భరించారు. మా పీడీ మేడమ్ చొరవ, ప్రిన్సిపల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయుల ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. నేను వారిని ఎన్నటికీ మరిచిపోలేను. ఏషియన్ పోటీలకు ప్రాతినిధ్యం మరువలేను.. ప్రస్తుతం నేను ఎస్సెస్సీ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. వార్షిక పరీక్షల సమయంలోనే జాతీయ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏప్రిల్ 6న భువనేశ్వర్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 225 మందికి ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో 32 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఇందులో నుంచి 20 మందిని ఎంపిక చేసి జూన్ రెండో తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఇందులో నుంచి 12 మందిని ఎంపిక చేశారు. ప్రధాన జట్టు ఆరుగురిలో నేను ఒకరిగా నిలవడం.. మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా జన్మలో మరచిపోలేని సంఘటన. థాయిలాండ్ లో 14వ ఏషియన్ జూనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పూల్–బీలో పటిష్ట జట్లు అయిన జపాన్, చైనాతోపాటు భారత్ ఉంది. మేము గెలిచింది ఒక మ్యాచ్‌లోనే అయినా... వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గరుండి చూశాను. ఆటను మరింత మెరుగుపరుచుకుని జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావడమే తొలి లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎస్ సాధించడమే నా ఆశయం’’ అన్నారు శాంతకుమారి. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే.. బాలానగర్‌లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) విద్యార్థినులు మొదటి నుంచి చదువుతోపాటు ఆటల్లోనూ ముందున్నారు. రగ్బీలో రాష్ట్ర స్థాయిలో మా స్కూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జట్టు గోల్డ్‌మెడల్ గెలుచుకుంది. కాట్రావత్ శాంతకుమారికి క్రీడలంటే చాలా ఇష్టం. వాలీబాల్‌లో ఆమె రాణిస్తుందనే నమ్మకంతో ఆ క్రీడవైపు మళ్లించా. ఎలాంటి ఆధునిక వసతులు లేని చోటు నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం గర్వకారణం. క్రమశిక్షణ, పోరాట పటిమతోనే ఆమె ఈ స్థాయికి వచ్చింది. – ఎం.అరుణారెడ్డి, పీడీ, బాలానగర్ గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ (బాలికలు) ఐదు వందలకు అమ్మాలనుకున్నాం! మాకు మొదటి ముగ్గురూ ఆడపిల్లలే. నాలుగో సంతానం కూడా ఆడ పిల్లే. అప్పుడే మా గుడిసెలు తగలబడ్డాయి. దీంతో నాలుగో కూతుర్ని అమ్మాలని మా పెద్దలు నిర్ణయానికి వచ్చారు. రూ.500కు గిరాకీ కూడా తీసుకొచ్చారు. కానీ మాకు మనసు ఒప్పలే. ఏ కష్టం చేసైనా సరే. మా బిడ్డల్ని మేమే సాకుతాం అని చెప్పినం. ఉన్న దాంట్లో తింటున్నం. సదివిస్తున్నం. పెళ్లిళ్లు చేసినం.. మా బిడ్డ గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతాంటే గర్వంగా ఉంది. – కె. భామిని, అమృనాయక్, శాంతకుమారి తల్లిదండ్రులు – కిషోర్ కుమార్, పెరుమాండ్ల, (సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్) ఫొటోలు: భాస్కరాచారి, (సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్) -
విషాదం: ఇంటి మిద్దెకూలి మనవడితో సహా సర్పంచ్ మృతి
సాక్షి, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండ రావిపాకుల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి మిద్దెకూలి గ్రామ సర్పంచ్ లచ్చమ్మ (51), ఆమె మనవడు యోగేశ్వర్ (7) మృతి చెందారు. మంగళవారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మిద్దెకూలిపోయి వారిపై పడింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. కాగా, బండ రావిపాకుల.. ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామం కావడంతో చాలా రోజులుగా పునరావాసం కోసం వేచిచూస్తున్న గ్రామస్తులు, ప్రభుత్వం పునరావాసం కల్పించకపోవడంతో అదే ఇళ్లలో ఉంటున్నారు. ఈక్రమంలో సర్పంచ్ ఇళ్లు పాతదై పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీఓ,తహసీల్దార్లతో గ్రామస్తుల వాగ్వివాదం గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషయం తెలియడంతో ఆర్టీఓ, తహసీల్దార్ బాధితు కుటుంబాన్ని పరామర్శించేందుకు బండ రావిపాకుల వెళ్లారు. అయితే, ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు ప్రాణాలు బలయ్యాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఓ, తహసీల్దార్లను అడ్డుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. తమకు సకాలంలో పునరావాసం ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి పరిస్దితి తలెత్తేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులంతా పునరావాస పరిహారంపై పట్టుబట్టడంతో ఆర్టీఓ, తహసీల్దార్లు వెనుదిరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. చదవండి: కేపీహెచ్‌బీకాలనీ: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం -
ఈ మహిళలు మీనముత్యాలు!
వనపర్తి: పురుషుల కంటే తామేమీ తీసిపోబోమని కృష్ణా నదీ తీర ప్రాంతానికి చెందిన మహిళలు నిరూపిస్తున్నారు. కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లిలో 309 కుటుంబాలు ఉండగా అందులో 45 మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వారి జనాభా 200 వరకు ఉంటుంది. గ్రామంలో కొందరు మహిళలు భర్తలతోపాటు 25 ఏళ్ల నుంచి చేపల వేటను సంప్రదాయ వృత్తిగా కొనసాగిస్తున్నారు. కృష్ణా నదిలో ఎక్కువగా నీరు నిలిచినప్పుడు (శ్రీశైలం బ్యాక్‌వాటర్) పుట్టీల్లో కూర్చొని సాలు వలల సాయంతో చేపల వేట సాగిస్తున్నారు. చెరువుల్లో చేపల వేట కోసం ఉపయోగించే వలలకు ఈ సాలు వలలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కటీ 200 నుంచి 400 అడుగుల పొడవు.. 10 అడుగుల వెడల్పు ఉంటాయి. ప్రస్తుతం కొందరు మహిళలు నదిలోకి ఒంటరిగానే వెళ్లి చేపలు పడుతున్నారు. మత్స్యకారుల కుటుంబాల్లోని మహిళలతోపాటు బోయ, కుమ్మర, ముస్లిం మతానికి చెందిన వారు కూడా చేపలు వేటాడుతుంటారు. అయితే వారి కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారు. వారు తెచ్చే చేపలను గంపగుత్తగా అన్ని రకాల చేపలను కిలో రూ. 30 చొప్పునే కొనుగోలు చేస్తూ వారానికోసారి డబ్బులిస్తున్నారు. ఆరు నెలలు చేపల వేట.. కృష్ణా తీర ప్రాంతంలోని తిప్పాయిపల్లిలో చాలా కుటుంబాలు ఏడాదిలో ఆరు నెలలు చేపలవేటపై ఆధారపడి జీవిస్తుంటాయి. మిగతా సమయంలో పొలాలు ఉన్నవారు వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ గ్రామ మహిళలను ఆదర్శంగా తీసుకుని తీర ప్రాంతానికి చెందిన పెంచికలపాడు, గుమ్మడం, యాపర్ల, బస్వాపురం గ్రామాల్లోని మహిళలు సైతం చేపలవేట కోసం ఏటి(నదిలోకి)కి వెళ్తుంటారు. ఏటా శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు చేపలవేట కొనసాగిస్తుంటారు. మార్చి మొదటివారం నుంచి నీరు తగ్గడంతో.. ప్రస్తుతం ఐదారు కుటుంబాల కంటే ఎక్కువమంది మహిళలు చేపల వేటకు వెళ్లడం లేదు. పట్టించుకోని మత్స్యశాఖ.. తిప్పాయిపల్లితోపాటు కృష్ణా నది తీర ప్రాంతంలోని ఏ గ్రామంలోని మత్స్యకార కుటుంబాలకు లైసెన్స్‌లపై అవగాహన కల్పించడంలో మత్స్యశాఖ విఫలమైంది. ఆయా గ్రామాలకు చెందిన చేపలు పట్టే మహిళలకు లైసెన్స్‌లు లేకపోవడంతో (వరుసగా మూడేళ్లు లైసెన్స్ రెన్యూవల్ ఉండాలి) మత్స్యశాఖ నుంచి బీమా, ఇతర ప్రయోజనాలు పొందడానికి అర్హత ఉంటుంది. మరోవైపు ఒక్కో సాలు వల రూ. 3 వేలు, పుట్టి రూ. 15 వేలు ఉంటుంది. రాళ్లు, ముళ్ల కంపలు వరదతో కొట్టుకొస్తే వలలు చిరిగిపోయి కొత్తవి కొనాల్సి వస్తోందని మత్స్యకార మహిళలు చెబుతున్నారు. -
భర్త తిట్టాడనే మనస్తాపంతో!
కొత్తకోట రూరల్: పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కొమ్ము నర్సమ్మ(60) సోమవారం భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల దగ్గర వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం, ఆమె భర్త చంద్ర య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 94407 95727కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు! -
ఆర్టీసీ బస్సు బోల్తా,ఇద్దరికి గాయాలు
-
మృత్యుగీతిక
సాక్షి, వనపర్తి: పెళ్లిలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం.. ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళుతున్న బంధువుల బృందం.. ఇంటికి వెళ్లాలన్న తొందర ఒకరిది.. పెళ్లి ముహూర్తం దాటిపోతుందన్న ఆత్రుత మరొకరిది.. వాహనాల వేగం పెరిగింది.. కానీ ఒక్క క్షణంలో అంతా తారుమారు.. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన ఓ కారు.. డివైడర్‌పైకి ఎక్కి అవతలివైపు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది..ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఏడుగురి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరిని, చికిత్స పొందుతూ మరొకరిని మృత్యువు కబళించింది. మరో ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసిన ఈ దుర్ఘటన.. 44వ నంబర్ జాతీయ రహదారిపై వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట వద్ద బుధవారం ఉదయం 7.45 గంటల సమయంలో జరిగింది. పెళ్లి ముహూర్తం దాటిపోతుందని.. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్లకు చెందిన ఆంజనేయులు (35), మదనాపురం మండలం అజ్జకొల్లుకు చెందిన పత్తోల్ల రాజు (34), అమరచింత మండలం మస్తీపూర్‌కు చెందిన కుర్వ మల్లేశ్ (28), మొగిలయ్య, నందిమల్ల గ్రామానికి చెందిన నరేశ్ (25) హైదరాబాద్‌లోని మల్లాపూర్‌లో ఉంటూ పళ్ల వ్యాపారం చేస్తుంటారు. అప్పుడప్పుడూ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. వీరి బంధువు మూలమల్ల గ్రామానికి చెందిన కుర్వ బుడ్డమ్మ కుమారుడు శ్రీకాంత్ వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఈ వివాహంతో పాటు చిన్నచింతకుంట మండలం నెల్లికొండిలో జరిగే అమ్మవారి పండుగకు వెళ్లాలని వారంతా నిర్ణయించుకున్నారు. వారికి బంధువైన మదనాపురం మండలం గోపన్‌పేటకు చెందిన బీరప్ప (24) కారు (మహీంద్రా వెరిటో)లో హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో బయలుదేరారు. పెళ్లి ముహూర్తం 8 గంటలకే ఉండడంతో త్వరగా చేరుకోవాలన్న ఆత్రుతలో వేగంగా వస్తున్నారు. పెళ్లికి హాజరై వస్తూ.. కడప జిల్లా కేంద్రానికి చెందిన సూరిబాబు (52) హైదరాబాద్‌లోని బడంగ్‌పేటలో పరుపులు, దిండ్ల వ్యాపారం చేస్తున్నారు. ఆయన భార్య సునీత, కుమా ర్తెలు మౌనిక, కల్పన ఉన్నారు. మౌనికకు వివాహం కాగా.. కల్పన ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల 20న (మంగళవారం) కర్నూలు జిల్లా కల్లూరులో సూరిబాబు మేనత్త ప్రసూన మనవడు సాయి వివాహం జరిగింది. దానికి సూరిబాబు, సునీత, కల్పనతో పాటు అనంతపురం జిల్లా పూలకుండ్ల మండలం మేకల చెరువు గ్రామానికి చెందిన అత్త రాజమ్మతో కలసి హాజరయ్యారు. తిరిగి బుధవారం ఉదయం 6 గంటల సమయంలో తమ కారు (రెనాల్ట్ పల్స్)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వారితోపాటు సూరిబాబు మేనత్త ప్రసూన ఉన్నారు. రెప్పపాటులో ప్రమాదం.. సూరిబాబు కుటుంబం పెళ్లికి హాజరై హైదరాబాద్‌కు వెళుతుండగా.. ఆంజనేయులు, మిగతావారు మూల మల్లలో వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఉదయం 7.45 గంటల సమ యంలో కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామశివారు వద్ద ఆంజనేయులు బృందం కారు (మహీంద్రా వెరిటో) అదుపుతప్పింది. అత్యంత వేగంతో డివైడర్ ఎక్కి.. అవతలివైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న సూరిబాబు కారును బలంగా ఢీకొట్టింది. మహీంద్రా వెరిటో వాహనంలో ఉన్న ఆంజనేయులు, రాజు, మల్లేశ్, బీరప్పతోపాటు రెనాల్ట్ కారులో ఉన్న సూరిబాబు, ప్రసూన, రాజమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సునీత, కల్పన, నరేశ్, మొగిలయ్యలు తీవ్రంగా గాయపడగా.. మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సునీత మార్గమధ్యంలోనే మృతి చెందగా.. నరేశ్ చికిత్స పొందుతూ మరణించాడు. మొగిలయ్య, కల్పనల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. మితిమీరిన వేగంతో.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే.. ఘటన సమయంలో రెండు కార్లు కూడా గంటకు 100 కిలోమీటర్లకుపైగా వేగంతో దూసుకెళుతున్నట్లు తెలు స్తోంది. కార్ల టైర్లు పగిలిపోయి.. ముందు సీటు భాగం వరకు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు కార్ల డ్రైవర్లు సీటు బెల్ట్ పెట్టుకుని ఉండడంతో.. వారి తలకు గాయాలు కాలేదు. కానీ వాహనాలు స్టీరింగ్ వరకు దెబ్బతినడంతో ఛాతీ, ఇతర శరీర భాగాలపై ఒత్తిడి పడింది. సూరిబాబు నడుపుతున్న వాహనం బెలూన్లు తెరుచుకున్నా ప్రాణనష్టం తప్పలేదు. విషాదంలో కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించడంతో వారి కుటుంబాలన్నీ తీవ్ర విషాదంలో కూరుకు పోయాయి. హైదరాబాద్ నుంచి వెళుతూ మృతి చెందిన బీరప్ప, ఆంజనేయులు, రాజు, మల్లేశ్.. అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మహీంద్రా వెరిటో యజమాని బీరప్పకు రెండేళ్ల క్రితమే రజితతో వివాహం జరిగింది. బీరప్ప మృతితో ఆమె కన్నీట మునిగిపోయింది. ఇక ఆంజనేయులుకు భార్య నర్సమ్మ, ఆరేళ్లలోపు వయసున్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. రాజుకు భార్య రేణుక, పదేళ్లలోపు వయసున్న ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మల్లేశ్‌కు భార్య పద్మ, ఏడేళ్ల కుమారుడు శివ, ఐదేళ్ల కుమార్తె పావని ఉన్నారు. ప్రమాదంలో ఈ కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోవడంతో రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. ఇక రెనాల్ట్ కారులో హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సూరిబాబు, ఆయన భార్య సునీత ఇద్దరు మృతి చెందారు. కుమార్తె కల్పన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డివైడర్ ఎత్తు తగ్గడంతో భారీ ప్రమాదం జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించిన తర్వాత మధ్యలో డివైడర్‌ను తక్కువ ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వేసిన రోడ్డుపైనే మళ్లీ రోడ్డు వేస్తూ వెళ్లడంతో రోడ్డు ఎత్తు పెరిగి.. మధ్యలో డివైడర్ ఎత్తు తగ్గినట్లయింది. దీంతో కొద్దిగా అదుపు తప్పిన వాహనాలు కూడా.. డివైడర్‌ను ఢీకొట్టి ఆగిపోకుండా అవతలివైపునకు దూసుకెళ్లి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలోనూ అవతలి వైపు కారును ఢీకొని ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరగడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాంకేతిక లోపాలతో నిత్యం ప్రమాదాలే! హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే 44వ నంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిని నాలుగు లేన్లుగా విస్తరించకముందు ట్రాఫిక్ ఎక్కువగా ఉండి.. ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగాయి. అయితే జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసినప్పటి నుంచి మరో రకంగా ప్రమాదాలు పెరిగిపోయాయి. మలుపులు ఎక్కువగా ఉండడం, కల్వర్టులు, క్రాస్ రోడ్ల వద్ద సరిగా రోడ్డు కనిపించని పరిస్థితి వంటి సాంకేతిక లోపాలే దీనికి కారణం. ఇలాంటి కారణంతోనే వనపర్తి జిల్లా (పాత మహబూబ్‌నగర్ జిల్లా) కొత్తకోట మండలం పాలెం వద్ద 2013 అక్టోబర్ 30న భారీ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వస్తున్న వోల్వో బస్సు కల్వర్టును ఢీకొనడంతో డీజిల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దాంతో రోడ్డు నిర్మాణ లోపాలపై సందేహాలు వెల్లువెత్తాయి. పాలెం దుర్ఘటన తర్వాత తీరిగ్గా మేల్కొన్న అధికారులు.. 44వ నంబర్ జాతీయ రహదారిపై పలు చోట్ల మరమ్మతులు చేశారు. కల్వర్టులను సరిచేసి, రోడ్డు క్రాసింగ్లను విస్తరించారు. కానీ వేసిన రోడ్డుపైనే మళ్లీ తారుతో రోడ్డు వేయడంతో.. మధ్యలో ఉన్న డివైడర్ ఎత్తు తగ్గిపోయింది. దీంతో వాహనాలు డివైడర్ ఎక్కుతున్నాయి. కొన్నిసార్లు అవతలివైపునకు దూసుకెళ్లి.. ఆ లైన్లో ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఇలా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు.. నివారణపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును తొలగిస్తున్న సహాయక సిబ్బంది సూరిబాబు, ఆంజనేయులు, రాజు బీరప్ప, మల్లేశ్, నరేశ్ -
సమస్యల తండా
కొత్తకోట : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, తండాల అభివృద్ధికి కోట్లాదిరూపాయలు వెచ్చిస్తుంది. కానీ మారుమూల ప్రాంతాల్లోని అనుబంధ గ్రామాలు పాలకుల నిర్లక్ష్యం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడంలేదు. ఇదీ పరిస్థితి మండలంలోని కానాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కానాయపల్లి తండా ఉంది. తండా మండల కేంద్రానికి సు మారు 6 కి.మీ. దూరంలో ఉంది. తం డాలో 62 కుటుంబాలు, 350 మంది జనాభా ఉన్నారు. కానాయపల్లి గ్రామం శంకరసముద్రం రిజర్వాయర్‌లో భాగం గా ముంపునకు గురైంది. గ్రామస్తులకు ప్రభుత్వం మరో చోట పునరావాసం కల్పించనుంది. కానీ గ్రామానికి అతి దగ్గరంలో ఉన్న కానాయపల్లి తండాకు సంబంధించి 110 ఎకరాలు ముంపులో పోగా, కేవలం 20 ఎకరాలు మాత్రమే మిగిలింది. శంకర సముద్రం రిజర్వాయర్‌లోకి పూర్తి స్థాయిలో నీరు వస్తే 300 మీటర్ల దూరంలోనే ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. సమస్యలివి.. తండాలో వీధిలైట్లు లేవు. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉంది. తండావాసులకు ప్రత్యేకమైన రోడ్డు సౌకర్యం లేదు. బండ్ల బాటే.. రోడ్డు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని తండావాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని వారు కోరుతున్నారు. గ్రామ పంచాయతీగా గుర్తించాలి కానాయపల్లి తండా, మనిగిల్ల తండా, బుగ్గపల్లితండాలను కలిపి గ్రామ పంచాయితీలుగా గుర్తించాలి. అనుబంధ గ్రామం కావడం మూలంగా తండాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలి. – అంజినాయక్, కానాయపల్లితండా ముంపు గ్రామంగా గుర్తించాలి కానాయపల్లి తండాను ముంపు గ్రామంగా గుర్తించాలి. రేషన్ దుకాణం లేకపోవడం వల్ల కానాయపల్లికి 3 కి.మీ. దూరం కాలినడక వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే చాలా సమస్యలు తీరుతాయి. – రుక్కమ్మ, కానాయపల్లి తండా -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
కొత్తకోట(వనపర్తి): వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్తున్న రైతు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జిల్లాలోని కొత్తకోట మండలం అమడబాకుల వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన వెంకట్రాములు(50)గా గుర్తించారు. -
డెంగ్యూతో కార్మికుడు మృతి
వనపర్తి టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : వనపర్తి మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గోర్ల చిన్న మన్యం(42) శుక్రవారం రాత్రి డెంగ్యూతో మృతిచెందాడు. మన్యానికి రెండు నెలల కిందట డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దసరా పండుగకు ఇంటికి వెళదామని పట్టుబట్టడంతో రెండు రోజుల క్రితం వనపర్తికి తీసుకొచ్చారు. కాగా శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. అతడికి భార్య చెన్నమ్మ, ముగ్గురు కొడుకులు ఉన్నారు. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
వనపర్తి రూరల్ (మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజీవ్‌చౌక్‌లో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కె.చంద్రారెడ్డి (58)గా పోలీసులు గుర్తించారు. పని మీద వనపర్తి పట్టణానికి వచ్చినట్టు సమాచారం. -
ఆత్మహత్య పరిష్కారం కాదు
వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా): ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవారిని అనాథలను చేయటం తప్ప ఏం సాధించలేమని సామాజిక కార్యకర్త పోచ రవిందర్‌రెడ్డి అన్నారు. కరువు ప్రభావంతో వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలను కొంత వరకు అయినా తగ్గించేందుకు పోచ అడుగు ముందుకు వేశాడు. రైతులకు తన వంతుగా ధైర్యాన్ని నింపే మాటలు నాలుగు చెప్పి వారికి కుటుంబంపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గురువారం వనపర్తి మండలం అప్పాయిపల్లి గ్రామంలో రైతులకు ఆత్మహత్యలతో కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు అండగా ఉండటం సమాజంలో ప్రతి ఒక్కరి సామాజిక బాద్యతగా భావించాల్సిన పాలకులు,అధికారులు రైతు సంక్షేమాన్ని విస్మరించటంతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా రైతు సంక్షేమం మన అందరి బాధ్యత అని గుర్తించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షులు డి. శంకర్రావు, వనపర్తి జెడ్పీటీసీ సభ్యలు వెంకటయ్య, సర్పంచు విష్ణుయాదవ్ రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
'ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యమివ్వండి'
అడ్డాకుల (మహబూబ్‌నగర్ జిల్లా) : 'మిషన్ కాకతీయ' పనుల్లో ప్రజలకు ఉపయోగపడే కాలువల మరమ్మతుల లాంటి అత్యవసరమైన పనులకు ప్రాధాన్యమివ్వాలని నీటిపారుదలశాఖ ఈఈ విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన వనపర్తికి వెళ్లే ముందు మూసాపేట చౌట చెరువు నుంచి విడుదలయ్యే వరద నీళ్లు కొమిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే కొత్త కాలువను ఈఈ పరిశీలించారు. కాలువ పూర్తిగా పూడిపోయిన నేపథ్యంలో మురుగు నీళ్లు కాలువలోంచి ముందుకు వెళ్లే వీలే లేదు. దీంతో కాలువను బాగు చేయిస్తే మురుగు నీళ్లు ఇళ్ల సమీపాల్లో నిలువ ఉండకుండా చేసే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ ఏఈ జయరామ్ ఈఈ విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కాలువను పరిశీలించారు. కాలువ సమీపంలో ఉన్న ఇళ్ల చుట్టూ నిలిచిన మురుగు నీళ్లను చూసి స్థానికులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. మురుగు నీళ్ల మూలంగా స్థానికులు పడుతున్న ఇబ్బందులను చూసి ఈఈ చలించిపోయారు. కాలువను బాగు చేయించడానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇళ్ల నుంచి నీళ్లు కాలువలోకి వచ్చేలా కొత్తగా ఓ కాలువను తీయించే విధంగా చూడాలని ఏఈకి సూచించారు. అదేవిధంగా మిషన్ కాకతీయ పనులను నాణ్యవంతంగా చేయించాలని చెప్పారు. మిషన్ కాకతీయ పనుల్లో రైతులతో పాటు ప్రజలకు ఉపయోగపడే పనులుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని చేయించే విధంగా కృషి చేయాలని సూచించారు. -
మహిళపై అత్యాచారం, హత్య
వనపర్తి (మహబూబ్‌నగర్ జిల్లా) : గుర్తుతెలియని మహిళపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం నాగారం గ్రామంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాగారం గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు గ్రామంలోని రాజాగారితోటలో పశువుల మేతకు వెళ్లారు. కాగా అక్కడ మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. మహిళపై అత్యాచారం చేసి ఆపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా మహిళ వివరాలు, ఆమె హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు, దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
మహిళా.. వందనం
నిను చులకనగా చూస్తున్న సమాజానికి చుక్కానిలా నిలిచావు అవమానాలెన్ని ఎదురైనా అన్నింటా మేటిగా రాణించావు కలుపుతీసి.. కోత కోసి బంగారం పండించావు ఆకాశం నిండా నేనేనంటూ గగనతలంలో విహరించావు మోటారు వాహనాలను నడుపుతూ ముందుకు దూసుకుపోయావ్ ఆత్మీయత పంచి.. అనురాగం పెంచి సమాజగమనాన్ని నిర్దేశించావు ఆడపిల్లవు.. నీకెందుకులే అన్న సమాజాన్ని ముందడుగు వేయించావు చదువు.. ఆట పాటలే కాదు.. తుపాకీ భుజానికెత్తుకొని కాపలాకాసి దేశానికి భద్రతనిచ్చావు ఆడపిల్ల ఏం చేస్తుందిలే అన్న సమాజపు అహంకారంపై సవాల్ విసిరి విజయబావుటా ఎగురవేశావు అల్లరిమూకల ఆడగాలు ‘నిర్భయ’ంగా ఎదుర్కొంటూ జీవనసమరంలో దూసుకుపోతున్న మహిళా.. సమాజంలో ఎందుకీ దుర్గతి.. ఆడపిల్ల పుడితే అరిష్టమని భావిస్తున్నారెందుకు...? పుట్టేది ఆడపిల్ల అని తెలుసుకొని నిన్ను కడుపులోనే చంపుతున్నారు... అక్కడో.. ఇక్కడో.. ఒకరో.. ఇద్దరో..పుట్టినా వరకట్న పిశాచాలకు బలవుతూనే ఉన్నారు కొందరు కామాంధులు నిలువునా దహించి వేస్తున్నారు ఇన్ని అవరోధాలు తట్టుకొని జీవిస్తూ కుటుంబానికి.. దేశానికి వెలుగునిస్తున్న ఓ మహిళా నీకు వందనం.... జీవితమంతా కళాసేవకే అంకితం వనపర్తి: చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న సంప్రదాయ నృత్యాన్ని కాలక్షేపం కోసం కాకుండా ప్రాచీన కళలను బతికించాలన్న తపనతో ఆమె తలపెట్టిన సంకల్పం నేడు ఎందరినో కూచిపూడి కళాకారులుగా మార్చింది. 40ఏళ్లుగా కూచిపూడిలో దాదాపు 3వేల మంది చిన్నారులకు శిక్షణ ఇచ్చిన కుమారి నీరజాదేవి జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. వివిధ వేదికలపై వనపర్తి కళాకారులు అందెల సవ్వడి చేస్తూ అలరిస్తున్నారు. వివాహం కూడా చేసుకోకుండా తన జీవితానంతా కళారంగానికే అర్పించారు. తనవద్ద నృత్యం నేర్చుకున్న చిన్నారులే తన బిడ్డలుగా భావిస్తూ ఆమెవారికి గోరు ముద్దలు పెట్టినట్లుగా ‘దిద్దితై దిద్దితై’ అంటూ చిన్నారులను తన లోకంలోకి తీసుకెళ్తుంది. నీరజాదేవికి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లితండ్రులు యశోదమ్మ ,శ్రీనివాసభగవాన్లు కర్నూలులోని ఏలేశం సూర్యప్రకాశంశర్మతో కూచిపూడి నృత్యం నేర్పించారు. ఆ తర్వాత వనపర్తికి వచ్చిన ఆమె 1979లో స్వర్ణముఖి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి, చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ఆమె వద్ద శిక్షణ తీసుకున్న ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. ఒకప్పుడు బాగా డబ్బున్న వారు మాత్రమే నేర్చుకునే కూచిపూడి నృత్యాన్ని ఆమె పేద, మధ్య తరగతి వారికి అందుబాటులోకి తెచ్చారు.నృత్యంలోని అభినయాన్ని క ళ్లకు కట్టినట్లు కనిపించే విధంగా చిన్నారులకు ఆమె శిక్షణ ఇస్తున్నారు. కూచిపూడి ఒక నృత్య విధానమే కాదని దానిద్వారా చిన్నారులకు మనదేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని, అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతోందని ఆమె అంటున్నారు. విదేశాల్లో తమ పిల్లలకు కూచిపూడి నృత్యం నేర్పిస్తే వేల డాలర్లు ఇస్తామనే వారున్నారని, తనకు మారుమూల ప్రాంతాల పిల్లలకు నేర్పించాలనే తపనే ఇక్కడ ఉండేలా చేసిందని నీరజాదేవి చెబుతున్నారు. కలలో కూడా ఊహించలేదు... గృహిణిగా ఉన్న నేను 2006లో రేషన్‌షాపు డీలర్‌గా ఎంపికయ్యా. ఎనిమిదేళ్లపాటు పని చేశాను. నాగర్‌కర్నూల్ జెడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో మాజీ జెడ్పీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశా. ప్రజలు నన్ను ఆదరించారు. 1842ఓట్ల మెజార్టీతో గెలిపించారు. నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిని అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇది అదృష్టంగా భావిస్తా. మహిళలు రాజకీయంగా ఈ సమాజంలో పురుషులతో సమానంగా ఎదగాల్సిన అవసరం ఉంది. మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సక్రమమైన పాలన అందిస్తే ఎప్పటికీ గుర్తింపు ఉంటుందనేది నా నమ్మకం. ఈ రోజు పార్టీ కూడా నన్ను గుర్తించి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి పురుషులతో సమానంగా అవకాశం కల్పిస్తే నాలాంటి వనితలు ఎందరికో ఎన్నో అవకాశాలు దక్కుతాయి. - కొండా మణెమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు, నాగర్‌కర్నూల్ రూరల్ తపాలాబిళ్లపై ‘మహిళ’ ముద్ర దేవరకద్ర రూరల్: ఏదేశమైన మహిళకు అత్యున్నత స్థానం ఇచ్చింది. అన్ని రంగాల్లో ఆమె పాత్ర ఉన్నతమైంది. తల్లిగా, చెల్లిగా, మార్గదర్శిగా, వీరనారిగా, ఉపాధ్యాయురాలిగా, అర్థాంగిగా, కవయిత్రిగా, నటిగా, సేవకురాలిగా, శాస్త్రజ్ఞురాలిగా ....ఇలా ఏరంగంలో చూసినా ప్రస్తుత తరుణంలో మహిళలు ముందుకు దూసుకెళ్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా మహిళ తన ముద్ర (స్టాంపు)వేసింది. దేవరకద్ర మండలం పేరూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కవి కమలేకర్ శ్యాంప్రసాద్‌రావు పదిహేనేళ్లుగా మహిళల స్టాంపులను సేకరించి భద్రపరుచుకున్నారు. ఈ స్టాంపుల్లో భారత తపాలాశాఖ ముద్రించిన మహిళామణుల స్టాంపుల ద్వారా ఎందరో భారత మహిళల గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. తొలి తపాలాబిళ్లపై మహిళాచిత్రం ప్రపంచంలో మీద మొదటి తపాలాబిళ్ల‘ పెన్నిబ్లాక్ ’ అనే పేరుతో 1840 మే 6న లండన్‌లో విడుదల చేశారు. బ్రిటీష్ రాణి చిత్రంతో ఈ తపాలాబిళ్ల ఆవిష్కతమైంది. అలాగే మనదేశంలో 1854 సెప్టెంబర్‌లో బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా విడుద లైన తొలి తపాలాబిల్లపై ‘విక్టోరియా రాణి’ చిత్రంతో ముద్రించడం గమనార్హం. 1943లో గవర్నమెంట్ ఆఫ్ ఆజాద్ హింద్ ముద్రించిన తపాలాబిల్లలో ‘చరకా తిప్పుతున్న మహిళ’ చిత్రాన్ని ముద్రించారు. స్వాతంత్య్ర భారతంతో 1952లో భక్త కవయిల్రి ‘మీరాబాయి’చిత్రంతో తపాలాబిళ్ల విడుదలైంది. తెలంగాణ ప్రాంతంలో భారత కోకిలగా పేరుగాంచిన సరోజిని నాయుడు స్మారకార్థం ఆమె చిత్రంతో 1964లో స్టాంపును విడుదల చేశారు. మనదేశంలో మహిళల స్టాంప్‌లు చాలామంది మహిళా చిత్రాలతో స్టాంపులు విడుదలయ్యాయి. ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి స్మారక తపాల బిళ్లను 1957 ఆగస్టు 17న విడులైంది. 960లో మహాకవి కాళిదాసు నాటకంలోని‘ శకుంతల’ చిత్రంతో స్టాంపు వచ్చింది. 1962లో మేడం బికాజీ కామ మహిళ పేరుతో, 1963లో డాక్టర్ అనిబిసెంట్, 1963లో రోజ్వెల్డ్, 1964లో దీపలక్ష్మీ , కస్తూర్బగాంధీ, 1968లో సిస్టర్ నివేదిత , 1969లో గాంధీజీతో కస్తూర్బా , 1970లో గర్ల్గైడ్, 1971లో అభిసారిక(ఆర్ట్), 1973లో రాధ (ఆర్ట్) , 1974 కమలానెహ్రూ, 1975 సరస్వతి (శిల్పం), భారతీయ లలిత కళలు, 1976లో కవయిత్రి సుభద్రకుమారి చౌహాన్, 1977 మాతృమూర్తి(శిల్పం), కిట్టుర్ రాణి చెన్నమ్మ , 1978లో తత్వవేత్త మదర్ , 1980లో హెలెన్ కిల్లర్ , మదర్‌థెరిస్సా, 1980లో భారతీయ పెళ్లి కూతురు, 1981లో భారతీయ గిరిజన మహిళ, 1982 దుర్గాబాయ్ దేశ్ ముఖ్, 1984లో ఇందిరా గాంధీ, 1987లో రుక్మిణీదేవి (డ్యాన్సర్), రామేశ్వరీ నెహ్రూ, ఆనంద్ మయి, 1988 రాణీ అవంతీ బాయి, రాణీ లక్ష్మీబాయి, రాణి దుర్గావతి, 1989లో రాజ్‌కుమార్ అమృత్‌కౌర్, పండిత రమాబాయి. 1990లో ధ్యానేశ్వరి, 1993లో నర్గీస్ (నటి)ల మహిళల చిత్రాలతో స్టాంపులు విడుదలయ్యాయి. -
వనపర్తిలో బ్యాంక్ చోరీకి యత్నం
-
ఫలించని జానా దౌత్యం
వనపర్తి: వనపర్తిని జిల్లాగా ప్రకటిం చాలని మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్షను విరమించజేసేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సోమవారం హైదరాబాద్‌లో జానారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రెడ్డితో చిన్నారెడ్డి దీక్ష విషయం చర్చించిన అనంతరం ఆయన రాత్రి వనపర్తికి వచ్చారు. చిన్నారెడ్డిని పరామర్శించి ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతానికి దీక్ష విరమించాలని.. అసెంబ్లీ వేదికగా వనపర్తి జిల్లా కోసం పోరాటం సాగిద్దామని చెప్పారు. తాను సీఎంతో మాట్లాడానని.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిస్తామని సీఎం చెప్పారని వివరించారు. అయితే, దీక్ష విరమణకు చిన్నారెడ్డి ఒప్పుకోలేదు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నేరుగా ప్రకటించే వరకు దీక్షను కొనసాగిస్తానని చిన్నారెడ్డి చెప్పారు. జానారెడ్డి మాట్లాడుతూ చిన్నారెడ్డికి వనపర్తి ప్రజల ఆకాంక్ష అత్యంత ముఖ్యమే అయినా.. ఆయన జాతీయస్థాయిలో కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారని.. ఆయన సేవలను మిగతా అంశాల్లో వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి ఉంటే రెండు నిమిషాల్లో వనపర్తిని జిల్లాగా చేసేవారమని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడ్డితే.. తమ పార్టీకి ఇక్కడి ప్రజలు సున్నం పెట్టారని అన్నారు. పదవులు పోగోట్టుకుని పార్టీని ఫణంగా పెట్టి ఆనాడు తాము తెలంగాణ తెచ్చే విషయంలో సోనియాగాంధీని ఒప్పించామన్నారు. తాము పడిన కష్టాన్ని ఓటర్లు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతిచ్చిన అఖిలపక్షాలతో చర్చించిన అనంతరం వారు దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపడంతో దీక్షను విరమించేది లేదని చిన్నారెడ్డి తెగేసి చెప్పారు. దీంతో జానారెడ్డి ఆయన వెంట వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు వెనుదిరిగారు. -
అర్ధరాత్రి హైడ్రామా..!
వనపర్తి టౌన్: వనపర్తిని జిల్లాగా ఏర్పా టు చేయూలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో అర్థరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తన దీక్షను భగ్నం చేసి, ఆసుపత్రికి తరలించేందుకు ఆదివారం అర్ధరాత్రి పోలీసులు ప్రయత్నాలు చేపట్టడంతో వారి రాకను ముందే పసిగట్టిన ఆయన హటాత్తుగా ఇంట్లోకి వెళ్లి గేటుకు తాళం వేసుకుని అక్కడే దీక్ష ను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మార్గమధ్యమంలో జరి గిన తోపులాటలో చిన్నారెడ్డి కింద పడిపోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దింపారు. అరుుతే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు చిన్నారెడ్డి ఇంటి ఎదుటే డీఎస్పీ చెన్నయ్య, సీఐ మధుసూదన్‌రెడ్డిలను అడ్డుకున్నారు. తామె ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు మాత్రమే వచ్చామని చెప్పడం తో ఆయన లోపలినుంచే వారితో మాట్లాడారు. తాను దీక్ష చేపట్టి రెండు రోజులు కూడా కాలేదని, తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. మీ ఆరోగ్యం క్షీణిం చిందని డాక్టర్లు చెప్పినందునే తాము వ చ్చినట్లు డీఎస్పీ చెప్పినా ఆయన విని పించుకోకుండా దీక్షను కొనసాగించారు. పోలీసులు మొండిగా వ్యవహరిస్తే ఆత్మార్పన చేసుకుంటామని కార్యకర్తలు హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఆయ న దీక్ష స్థలికి వచ్చి దీక్షలో కూర్చున్నారు. హామీ ఇచ్చారు..అమలు చేయూల్సిందే...! వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మెుదటివిడతలో నే వనపర్తి జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లుగానే జిల్లాను ఏర్పాటు చేయూలని జి.చిన్నారెడ్డి అన్నారు. చిన్నారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సోమవారం మూడో రోజు కొనసాగింది. ఆయన మాట్లాడుతూ తన దీక్షను భగ్నం చేసేందుకు ఆదివారం రాత్రి అధికారులు విఫలయత్నం చేయడం మంచి పద్దతి కాదన్నారు. వనపర్తికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని, భౌగోళికంగానూ జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. నిలకడగా చిన్నారెడ్డి ఆరోగ్యం... చిన్నారెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆయనకు బీపీ, షుగర్ పరీక్షలను నిర్వహించగా, బీపీ 138 నమోదు కాగా, షుగర్ 102గా నమోదైంది. -
అధికారంలోకి వచ్చాక నిజాం సుగర్స్‌పై విచారణ
-
తెలంగాణ ఆగదు
వనపర్తి, న్యూస్‌లైన్: ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామని టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ ఈటెల రాజేందర్ ధీమావ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ కళాకారుల సన్మానం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రముఖ కవి, గాయకుడు గోరెటి వెంకన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తల, తోకలేని ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. సీల్డ్‌కవర్ సీఎం ఇతరులు రాసిన స్క్రిప్టును అసెంబ్లీలో చదువుతున్నాడని ఎద్దేవాచేశారు. తెలంగాణ జానపదాలకు కొత్తనడకలు నేర్పిన ఘనత గోరెటి వెంకన్నకే దక్కిందన్నారు. ఆయన రాసిన పల్లేకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. అన్నపాట చంద్రబాబు 9 ఏళ్ల ప్రభుత్వాన్ని నేలమట్టం చేసిందన్నారు. తెలంగాణలో కవులు, కళాకారులు, గాయకులకు కొదవలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆటాపాటలు నడిపించాయని ప్రశంసించారు. భూమి ఉన్నంత వరకు మనిషి మనుగడ సాధించినంత వరకు తెలంగాణ కళాకారుల పాట బతికే ఉంటుందన్నారు. తెలంగాణలో కవులు, కళాకారులకు ప్రాధాన్యం పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవులు, గాయకులకు ప్రత్యేకరాష్ట్రంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. తెలంగాణ పాటను సత్కరించాలని నిరంజన్‌రెడ్డికి వచ్చిన ఆలోచన అభినందనీయమన్నారు. చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబులు తెలంగాణను అడ్డుకోలేరని శ్రీహరి స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు విలీనం చేశారని, ఇదే జిల్లానుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తుండటం ఎంతో ఆనందదాయకమన్నారు. సీమాంధ్ర కవి ఫ్రొపెసర్ కోయి కోటేశ్వర్రావు ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సభ చివరిలో గోరెటి వెంకన్న పాట సభికులను ఉర్రూతలూగించింది. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మందా జగన్నాథం, జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్ఎస్ ఇన్చార్జీలు పాల్గొన్నారు.