వనపర్తి నియోజకవర్గం
వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన మొదటి సారి గెలిచారు. 2014 నుంచి ఐదేళ్ళ తెలంగాణ ప్రణాళికా అభివృద్ది మండలి ఉపాద్యక్షుడుగా పనిచేసిన నిరంజన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి మంత్రి అయ్యారు. నిరంజన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిపై 51685 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కలిసి పనిచేసినా మహాకూటమి ఘోరంగా ఓడిపోవడం విశేషం.
నిరంజన్‌రెడ్డికి 111956 ఓట్లు రాగా, చిన్నారెడ్డికి 60271 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసిన కె.అమరేందర్ రెడ్డికి మూడువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. నిరంజన్ రెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గం నేత. మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి వనపర్తిలో 2009లో ఓడిపోయినా, 2014లో విజయం సాధించారు. 2014లో ఆయన టిఆర్‌ఎస్ సమీప ప్రత్యర్ధి నిరంజన్ రెడ్డిపై 3888 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఓటమి చెందారు.
45200 ఓట్లు తెచ్చుకుని ఈయన మూడోస్థానానికి పరిమితం అవ్వవలసి వచ్చింది. చిన్నారెడ్డి 1989, 1999, 2004,2014లలో గెలుపొందారు.2018లో ఓటమిచెందారు. రావుల చంధ్రశేఖర్‌రెడ్డి 1994లోను, తిరిగి 2009లో గెలిచారు. వనపర్తి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి పదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, ఒకసారి టిఆర్‌ఎస్, పి.ఎస్.పి ఒకసారి గెలు పొందాయి. 1957లో వనపర్తిలో పద్మనాభరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు.
ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ నుంచి గెలుపొందారు. టిడిపి నేత డాక్టర్ ఎ.బాలకృష్ణయ్య రెండుసార్లు గెలిస్తే, జె. కుముదినిదేవి రెండుమార్లు గెలు పొందారు. రావుల చంధ్రశేఖర్ రెడ్డి ఛీప్‌విప్‌గా పనిచేయగా, 2002లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వనపర్తిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గం గెలు పొందితే, నాలుగుసార్లు బిసిలు గెలిచారు. చిన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు.
వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment