S. Niranjan Reddy
-
వనపర్తి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
వనపర్తి నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయం సాదించారు. ఆయన మొదటి సారి గెలిచారు. 2014 నుంచి ఐదేళ్ళ తెలంగాణ ప్రణాళికా అభివృద్ది మండలి ఉపాద్యక్షుడుగా పనిచేసిన నిరంజన్ రెడ్డి ఎన్నికలలో గెలిచి మంత్రి అయ్యారు. నిరంజన్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిపై 51685 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కలిసి పనిచేసినా మహాకూటమి ఘోరంగా ఓడిపోవడం విశేషం. నిరంజన్‌రెడ్డికి 111956 ఓట్లు రాగా, చిన్నారెడ్డికి 60271 ఓట్లు వచ్చాయి. బిజెపి పక్షాన పోటీచేసిన కె.అమరేందర్ రెడ్డికి మూడువేల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. నిరంజన్ రెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గం నేత. మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి వనపర్తిలో 2009లో ఓడిపోయినా, 2014లో విజయం సాధించారు. 2014లో ఆయన టిఆర్ఎస్ సమీప ప్రత్యర్ధి నిరంజన్ రెడ్డిపై 3888 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ఓటమి చెందారు. 45200 ఓట్లు తెచ్చుకుని ఈయన మూడోస్థానానికి పరిమితం అవ్వవలసి వచ్చింది. చిన్నారెడ్డి 1989, 1999, 2004,2014లలో గెలుపొందారు.2018లో ఓటమిచెందారు. రావుల చంధ్రశేఖర్‌రెడ్డి 1994లోను, తిరిగి 2009లో గెలిచారు. వనపర్తి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి పదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, ఒకసారి టిఆర్ఎస్, పి.ఎస్.పి ఒకసారి గెలు పొందాయి. 1957లో వనపర్తిలో పద్మనాభరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ నుంచి గెలుపొందారు. టిడిపి నేత డాక్టర్ ఎ.బాలకృష్ణయ్య రెండుసార్లు గెలిస్తే, జె. కుముదినిదేవి రెండుమార్లు గెలు పొందారు. రావుల చంధ్రశేఖర్ రెడ్డి ఛీప్విప్గా పనిచేయగా, 2002లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వనపర్తిలో పన్నెండు సార్లు రెడ్డి సామాజికవర్గం గెలు పొందితే, నాలుగుసార్లు బిసిలు గెలిచారు. చిన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. వనపర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఎగ్ బోర్డు ఏర్పాటుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించే ఎగ్ బోర్డును ఏర్పాటుచేసి, కోడి గుడ్ల ధరను నిర్ణయించడంలోని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలో బ్రీడర్స్, హేచరీస్ రైతులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కోడిగుడ్ల ధరను నిర్ణయించడంలో నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) తీరుతో తాము నష్టపోతున్నామని కొందరు పౌల్ట్రీ రైతులు గురువారం మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 1,500 మంది లేయర్ పౌల్ట్రీ రైతులు ఉన్నారని, వీరికి గుడ్లు పెట్టే కోళ్లను సరఫరా చేసే బ్రీడర్ ఫార్మర్స్ వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నారు. తెలంగాణలో రోజూ మూడు కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, రాష్ట్రంలోనే 70శాతం గుడ్లను వినియోగిస్తున్నారన్నారు. పెరిగిన దాణా ఖర్చుకు అనుగుణంగా గుడ్డు ధర పెరగక పోవడంతో లేయర్ పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం మనుగడలో ఉన్న ఎగ్‌బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారని, ఎగ్‌బోర్డు ఏర్పాటు సాధ్యాసా«ధ్యాలపై అధ్యయనం చేసి, పౌల్ట్రీ రంగం నిలదొక్కుకునేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా గుడ్డు ధరను నిర్ణయించడంలో ఎన్ఈసీసీ వైఫల్యంతో ఒక్కో గుడ్డుపై సగటున రూపాయి చొప్పున నష్టపోతున్నట్లు పౌల్ట్రీ రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దాణా, విద్యుత్‌పై సబ్సిడీ ఇస్తున్నా ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. మంత్రిని కలిసిన వారిలో పౌల్ట్రీ రైతులు సమరసింహారెడ్డి, దిలీప్‌కుమార్, మనోజ్, రాకేష్, ఆనంద్, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
జూరాల నీటి విడుదలకు చర్యలు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, పాలమూరు రైతాంగ అవసరాలకు అనుగుణంగా జూరాల నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు, జూరాల ఎస్ఈ రఘునాథ్‌లతో కలసి మంత్రి సమీక్షించారు. నారాయణపూర్, ఆల్మట్టి నుంచి వస్తున్న వరద నీటిపై చర్చించారు. జూరాల నుంచి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2తోపాటు కోయిల్ సాగర్, నెట్టెంపాడులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి నీటి విడుదలకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.