ప్రకృతి అద్భుతాలు మనసుకు ఆహ్లాదంగానూ, విచిత్రంగాను ఉంటాయి. అబ్బా..! ప్రకృతి అందమే అందం మాటల్లో వర్ణించలేం. అలాంటి ఓ అద్భుత దృశ్యం తమిళనాడు, కేరళ వంటి హిల్‌స్టేషన్స్‌లోనే చూడగలం. ఈ అద్భుతం 12 ఒకసారి మాత్రమే కనువిందు చేస్తుంది. ప్రపంచమంత నీలిమయంలా చూపించే ఈ కమనీయ ప్రకృతి దృశ్యానికి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దాం..!
తమిళనాడులోని నీలగిరి కొండల్లో ప్రకృతి ఉత్కంఠభరిత దృశ్యం కనువిందు చేసింది. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్దులను చేసి ఈ నీలకురించి పువ్వులు ఈ ఏడాది వికసించి..ఆ నింగే భూమిపై వాలిందా అన్నంత అందంగా ఉంది. ఈ నీలకురించి పువ్వులు సాముహికంగా పుష్పిస్తాయి. అంతేగాదు ఇవి కేవలం 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అదికారిణి సుప్రియ సాహు సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకోవడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో కుట్టన్ అనే తోడా గిరిజనడు నీలకురించి పూల మధ్య గర్వంగా కూర్చొన్నట్లు కనిపిస్తున్న ఫోటో ఒక వైపు మరోవైపు ఆకుల గుండా పుష్పించిన శక్తిమంతమై నీలం పువ్వుల అందమైన చిత్రం తోపాటు ఓ వీడియో కూడా ఉంటుంది. అందులో పైన నీలి ఆకాశం కింద నీలగిరి పువ్వులతో ప్రపంచమే నీలిరంగు పులుముకుందా అన్నంత అందంగా కృష్ణుని నీలాన్ని తలపించేలా ముగ్ధమనోహరంగా ఉంది. ఈ మొక్కలు అంతరించిపోయే రెడ్‌లిస్ట్‌లో ఉన్నాయి. వీటిని రక్షించుకోవాల్సి అవసరం ఉందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి సాహు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలోనే కాకుండా కేరళ ఇడుక్కి జిల్లాలోని మున్నార్ హిల్ స్టేషన్‌లో కూడా నీలకురింజి పూల మొక్కలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని నీలగిరి కొండల్లో చివరిసారిగా 2006న పూశాయి మళ్లీ 2018న పూస్తాయని అనుకున్నారు కానీ అడవిలో వచ్చిన మంటల కారణంగా నీలకురించి కనిపించలేదు. మళ్లీ ఏడాది కనువిందు చేశాయి. భారతదేశంలో ఇలాంటి మొక్కలు మొత్తం 40 రకాలు ఉన్నాయి.
ఈ పువ్వులు పరాపరాగ సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్లే 12 ఏళ్లకు గానీ పుష్పించవు. తమిళనాడులోని పలియన్ తెగవారు వీటి వయసును లెక్కిస్తారు. ఆ తెగ వారు నీలకురింజిని పవిత్రంగా భావిస్తారు. అంతేగాదు ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనేను వ్యాపారులు ద్రవ బంగారంగా భావిస్తారట. అంటే మనం ఈ నీలకురించి పువ్వులను చూడాలంటే మళ్లీ 2036 వరకు ఆగాల్సిందే..!
Kuttan a Toda tribesman sits proudly among the blooming Neelakurinji flowers in Nilgiris. Flowers of Neelkurinji bloom once in 12 years cycle. It is said that Nilgiris gets its name due to the magical blue hue imparted by these stunning flowers. Neelakurinji Strobilanthes… pic.twitter.com/ugEgsxBiUk
— Supriya Sahu IAS (@supriyasahuias) September 26, 2024
(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్! అన్ని కోట్లా..!)
Comments
Please login to add a commentAdd a comment