రెండు రోజుల పాటు జరిగే జీ20 మంత్రుల సదస్సు శనివారం సిడ్నీలో ప్రారంభమైంది.
సిడ్నీ: రెండు రోజుల పాటు జరిగే జీ20 మంత్రుల సదస్సు శనివారం సిడ్నీలో ప్రారంభమైంది. ప్రపంచాభివృద్ధిని ప్రోత్సహించే విధానాల రూపకల్పన, మౌలిక రంగంలోకి భారీ పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారించనుంది.. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు పాల్గొంటున్నారు. భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ ఆర్థికాభివృద్ధికి దోహదపడే వాస్తవిక, ఆచరణీయ విధానాలను సదస్సు రూపొందిస్తుందన్న ఆశాభావాన్ని జీ20కి సారథ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ట్రెజరర్ జో హాకీ వ్యక్తం చేశారు. ఆర్థిక ఉద్దీపనలను అమెరికా ఉపసంహరించుకోవడం(టేపరింగ్)పై ఈ సదస్సులో తీవ్రమైన చర్చ జరిగే అవకాశముంది.