
టోక్యో : జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. కోబ్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్ గెస్ట్ హౌస్‌లో జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. మోదీ ప్రసంగం అనంతరం వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో సభ మారుమోగింది. ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచం దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడంలో జపాన్ పాత్ర కీలకమన్నారు. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో పలు అంతర్జాతీయ వేదికలపై తను పాల్గొనే విధానం తమ మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
తాను 2014లో భారత దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత షింజో అబెతో దౌత్యపరమై సంబంధాలను ఇరు దేశాల ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి భారతదేశ ప్రముఖులు స్వామి వివేకనందా, మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు జపాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించారని వెల్లడించారు. రెండో ప్రపంచ ముద్దం అనంతరం భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయన్నారు. జీ-20 సదస్సు కు స్వాగతించిన తీరుకు మోదీ.. షింజో అబే, జీ-20 సదస్సు చైర్మన్‌కు అభినందనలు తెలిపారు.
ఇరువురు దేశాధినేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విపత్తు నిర్వహణ, ఆర్థిక నేరస్థులపై సుదీర్ఘంగా చర్చించారు. అక్టోబర్‌లో జరిగే జపాన్ చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక వేడుకకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరువుతారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ఎనికైన తర్వాత జపాన్ ప్రధానితో సమావేశమవడం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment