shinjo abe
-
దుండగుడు చంపాలనుకుంది అబేను కాదట.. కానీ!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి. మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు. నౌకాదళంలో మూడేళ్లు విధులు: మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు: నారా ప్రాంతంలోని అతని అపార్ట్మెంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్ -
షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
వాషింగ్టన్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్ అంబాసిడర్ కోజి టొమితాకు భావోద్వేగ నోట్‌ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్. 'షింజో అబే కుటుంబం, జపాన్ ప్రజలకు బైడన్ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్. అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్. ఇది జపాన్ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ కోసం ఆయన విజన్ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. -
అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర
షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం. అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స అబె 1954 సెప్టెంబర్ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్ కేబినెట్ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు. ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్ జాతీయవాదానికి పోస్టర్ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్‌పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం. అది 1950ల్లో జపాన్ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ‘క్వాడ్’తో చైనాకు ముకుతాడు రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సంయుక్త కూటమి (క్వాడ్). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్‌గా రూపుదాల్చింది. అది జపాన్‌తో పాటు భారత్‌నూ అమెరికాకు సన్నిహితం చేసింది. -
Shinzo Abe: చెరగని ముద్ర వేసిన షింజో అబే
నేరగాళ్లు రెచ్చిపోవడం, ఎక్కడో ఒకచోట తుపాకులు పేలడం, పౌరులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిన వర్తమానంలో కూడా జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యో దంతం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. జపాన్‌లో హింసాత్మక ఘటనల శాతం తక్కువ. తుపాకుల వినియోగం దాదాపు శూన్యం. అటువంటి ఉదంతాలు ఏడాదికి పది కూడా ఉండవు. ఇటు చూస్తే షింజో అబే వివాదాస్పద వ్యక్తి కాదు. పైపెచ్చు జపాన్ ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న కష్టకాలంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దాన్ని గట్టెక్కించిన చరిత్ర ఆయనది. అందువల్లే 2012 నుంచి ఎనిమిదేళ్లపాటు అధికారంలో కొనసాగారు. రెండేళ్ల క్రితం ఆరోగ్యం సహకరించక పదవి నుంచి తప్పుకున్నారుగానీ ఆ సమయానికి కూడా ఆయన తిరుగులేని నేతగానే ఉన్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ అందరినీ మెప్పించాలని లేదు. వాటివల్ల ఇబ్బందులకు గురయ్యే వర్గాలు కూడా ఉంటాయి. కానీ మెజారిటీ ప్రజల సంక్షేమానికీ, శ్రేయస్సుకూ ఏది మంచి దన్నదే అంతిమంగా గీటురాయి అవుతుంది. అబేను పొట్టనబెట్టుకున్న దుండగుడు ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడన్నది మున్ముందు తెలుస్తుంది. కానీ అబే ఆర్థిక విధానాలు 2012 నాటికి నీరసించి ఉన్న జపాన్‌కు జవసత్వాలు ఇచ్చాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు అతి సంపన్న దేశంగా వెలుగులీని, ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్న జపాన్ 80వ దశకం మధ్యనుంచి వెలవెలబోవడం మొదలైంది. ఆ స్థానాన్ని చూస్తుండగానే గతంలో తన వలస దేశమైన చైనా ఆక్రమించింది. ఇది జపాన్ను కుంగదీసింది. రాజకీయ రంగంలో అస్థిరత చోటుచేసుకుంది. అస్థిర ప్రభుత్వాలు ఒకపక్క, ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క దాన్ని పట్టి పీడించాయి. సహజంగానే ఇవన్నీ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి. అలాంటి సమయంలో అబే అధికార పగ్గాలు స్వీక రించి ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. ఆ విధానాలు ‘అబేనామిక్స్’ పేరిట ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి. ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినా త్వరలోనే వాటివల్ల మెరుగైన ఫలితాలొచ్చాయి. జపాన్ పుంజుకుంది. ప్రారంభంలో జాతీయవాదిగా, స్వేచ్ఛా విపణికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న అ»ే తన వైఖరిని మార్చుకున్నారు. 2012కు ముందు విశాల పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) జపాన్ ప్రయోజనాలు దెబ్బతీస్తుందని వాదించిన ఆయనే, అధికారంలోకొచ్చాక దాన్ని నెత్తికెత్తుకున్నారు. ట్రంప్ ఏలుబడిలో ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటికొచ్చినా 2018లో వేరే దేశాలను కలుపుకొని దాన్ని మరింత విస్తరించారు. సంస్కరణలపై ఎంత మొగ్గు చూపినప్పటికీ అన్నిటినీ ప్రైవేటుపరం చేయాలన్న స్వేచ్ఛా మార్కెట్ ఉదారవాది కాదాయన. ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను ఏమాత్రం తగ్గించలేదు. దేశానికొక కొత్త రాజ్యాంగం కావాలనీ, సైనికంగా బలపడాలనీ ఆయన కలలుగన్నారు. కరోనా అవాంతరం లేకపోతే అది కూడా జరిగేదే. అమెరికా, కొన్ని యూరప్ దేశాల మాదిరిగా వలసలపై ఆంక్షలు విధించడం కాక, వాటిని ప్రోత్సహించారు. పర్యవసానంగా లక్షలాదిమంది విదేశీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించాయి. మన దేశానికి మంచి మిత్రుడిగా మెలిగారు. చైనాతో మనకు సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా సమర్థించారు. బహుశా కరోనా విరుచుకుపడకపోతే ఆయన ఆర్థిక విధానాలు మరింత మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేవేమో! కానీ కరోనా సమయంలో కఠినమైన లాక్డౌన్లు అమలు చేయడం వల్ల చాలామంది ఉపాధి కోల్పో యారు. ప్రకటించిన ఉద్దీపన పథకాలు ప్రజలకు పెద్దగా తోడ్పడలేదు. దాంతో ఆయనపట్ల వ్యతి రేకత మొదలైంది. ఒకపక్క అనారోగ్యం, మరోపక్క ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు ఆయన్ను కుంగదీసి చివరకు పదవినుంచి వైదొలగారు. జపాన్‌లో హింసాత్మక ఉదంతాలు లేనేలేవని చెప్పలేం. కానీ ఒక రాజకీయ నాయకుడిపై దాడి జరగడం చాలా అరుదు. 1960లో సోషలిస్టు నాయకుడు ఇనెజిరో అసానుమోపై ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. 2007లో నాగసాకి నగర మేయర్‌ను కాల్చిచంపారు. ఆ తర్వాత ఈ స్థాయి ఘటన జరగడం ఇదే ప్రథమం. ఆ దేశంలో సాయుధ బృందాల ఉనికి లేకపోలేదు. అయితే కరుడు గట్టిన యకుజా ముఠా సైతం తుపాకుల వినియోగం విషయంలో జంకుతుంది. తుపాకుల అమ్మ కంపై కఠిన ఆంక్షలు, వాటిని వినియోగించేవారికి కఠిన శిక్షల అమలు ఇందుకు కారణం. హింసా త్మక ఘటనలు అరుదు గనుక నేతలు భద్రత గురించి పెద్దగా పట్టించుకోరు. ఎన్నికల ప్రచార మంతా వీధి సభల ద్వారానే సాగుతుంది. నిజానికి దాడి జరిగే సమయానికి అలాంటి చిన్న సభ లోనే అబే మాట్లాడుతున్నారు. 1986లో అప్పటి స్వీడన్ ప్రధాని ఓలోఫ్ పామే నడుచుకుంటూ వెళ్తుండగా దుండగుడు ఆయన్ను నడి బజారులో కాల్చిచంపాడు. ఆ తర్వాత ప్రపంచాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతిపరిచిన ఘటన అబే హత్యోదంతమే. సంక్షోభాలకు ఏ దేశమూ అతీతం కాని వర్తమాన పరిస్థితుల్లో హింసకు ఏ ప్రాంతమూ మినహాయింపు కాదు. పైగా సంఘటిత నేర బృందాలకు బదులు ఎవరితోనూ సంబంధాలు లేనట్టు కనబడే వ్యక్తులే హింసకు దిగుతున్న ఉదంతాలు అమె రికా వంటిచోట్ల ఎక్కువయ్యాయి. కనుక నిరంతర అప్రమత్తత, నేతలకు తగిన భద్రత కల్పించడం తప్పనిసరి. వర్తమాన ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన నేతల్లో ఒకరిగా, భారత్‌కు చిరకాల మిత్రునిగా ఉన్న అబే ఒక దుండగుడి కాల్పుల్లో కనుమరుగు కావడం అత్యంత విచారకరం. -
లాక్డౌన్; జపాన్ కీలక నిర్ణయం
టోక్యో : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జపాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను మే31 వరకు పొడిగించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. దీనికి సంబంధించి సోమవారం జపాన్ ప్రధాని షింజో అబే వివిధ నిపుణుల బృందంతో చర్చలు జరుపుతున్నారు. లాక్డౌన్ పొడిగింపుకే ప్రధాని మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రానికల్లా దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 15,589 మందికి కరోనా వైరస్ సోకగా, 530 మరణించారు. (పెరుగుతున్న కేసులు.. ఎమర్జెన్సీకి అవకాశం ) కోవిడ్ నివారణకు నెలరోజుల పాటు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు ఏప్రిల్7 న ప్రధాని షింజో అబే ప్రకటించారు. మే 7న ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే లాక్డౌన్ పొడిగింపుకే ప్రధాని మొగ్గుచూపుతున్నట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. కరోనా వ్యాప్తి తగ్గితే త్వరలోనే పార్కులు, మ్యూజియం వంటి ప్రాంతాలను తెరిగి తెరవడానికి అనుమతిస్తామని జపాన్ ఆర్థిక మంత్రి వెల్లడించారు. దీని ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఏర్పడిన అడ్డంకులను కొంత వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. (వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్! ) -
వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్!
-
మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్!
టోక్యో: కరోనా(కోవిడ్-19) మహమ్మారి విస్తరిస్తున్న వేళ ట్విటర్లో ఓ వీడియోను షేర్ చేసిన జపాన్ ప్రధాని షింజో అబే నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ‘అసలు మీరు ఎవరో మీకైనా తెలుసా’ అంటూ ట్విటర్ యూజర్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. జపాన్‌లో ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందికి పైగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించాలని ప్రధాని షింజో అబే నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఆయా చోట్ల విద్యా సంస్థల మూసివేత, జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే చోట్లలో ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టారు.(కరోనా: మీ పౌరులను తీసుకువెళ్లండి.. లేదంటే..) ఈ క్రమంలో ప్రజలను ఇంటి వద్దే ఉండాల్సిందిగా సూచించిన షింజో అబే.. ‘‘ నా స్నేహితులను కలుసుకోలేను. పార్టీలకు వెళ్లలేను. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో మంది వైద్య సిబ్బంది కఠిన శ్రమకోర్చి సేవలు అందిస్తున్నారు. వారి పట్ల కృతజ్ఙతా భావం చాటుకోవాలి’’ అంటూ ఓ వ్యక్తి గిటార్ వాయిస్తున్న వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. సోఫాపై కూర్చుని... కుక్క పిల్లను ఒళ్లో ఆడిస్తున్న ప్రధాని వీడియో దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ‘‘సేవలు చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. అయితే ఒక విషయం చెప్పండి. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. మీరు ఎవరో మీకైనా తెలుసా. ప్రజలంతా విపత్కర పరిస్థితుల్లో విలవిల్లాడుతుంటే.. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరిలా విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నారు’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. దీంతో Who do you think you are? ట్రెండింగ్‌లో నిలిచింది.(వీధుల్లోనే కరోనా మృతదేహాలు) -
బంధానికి ఆంక్షలు అడ్డుకావు
వ్లాడివోస్టోక్: రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్–రష్యాల, వ్యూహాత్మకమైన ఇంధనం, రక్షణ రంగాలు, ఇరుదేశాల బంధంపై ఉండబోదని ప్రధాని మోదీ అన్నారు. ‘భారత్ కంపెనీలు రష్యాలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లోనూ, రష్యా సంస్థలు భారత్‌లోని ఇంధనం, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై పెట్టుబడులు పెట్టాయన్నారు. వీటిపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు అడ్డంకిగా మారబోవు’ అని తెలిపారు. క్రిమియా కలిపేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటి ప్రభావం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపైనా పడుతోంది. టాల్‌స్టాయ్– గాంధీజీ స్నేహమే స్ఫూర్తి ప్రముఖ రష్యా రచయిత, తత్వవేత్త లియో టాల్‌స్టాయ్, గాంధీజీల మైత్రి వారిద్దరిపైనా చెరగని ముద్ర వేసిందని ప్రధాని మోదీ అన్నారు. టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ’ పుస్తకం తన జీవితాన్ని మార్చివేసిందని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారని మోదీ తెలిపారు. వారి స్నేహం స్ఫూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం కీలక వాటాదారులు కావాలన్నారు. వ్లాడివోస్టోక్‌లో జరుగుతున్న 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీలో ప్రధాని గురువారం మాట్లాడారు. ‘రష్యా తూర్పు ప్రాంతాన్ని పెట్టుబడులకు వేదికగా భావిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉంటాం’అని తెలిపారు. ‘రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి రూ.7వేల కోట్లను భారత్ రుణంగా అందజేయనుంది. మరో దేశానికి భారత్ ఇలా రుణం ఇవ్వడం ‘ఒక ప్రత్యేక సందర్భం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాన్ని ఆవిష్కరించారు. ఈఈఎఫ్ వేదికగా రూ.36 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమ్మిళిత ‘ఇండో–పసిఫిక్’ ప్రాంతం భారత్, రష్యాల మధ్య బలపడిన మైత్రితో ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ‘ఆటంకాలు లేని, స్వేచ్ఛాయుత, సమ్మిళిత’ ప్రాంతంగా మార్చే నూతన శకం ప్రారంభమైందన్నారు. ‘ఈ విధానం నిబంధనలను, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంతో పాటు, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు. చైనా ఈ ప్రాంతంలో సైనిక బలం పెంచుకోవడం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమదే పెత్తనమనడంపై మోదీ పైవిధంగా మాట్లాడారు. -
జీ-20లో వందేమాతరం, జైశ్రీరామ్ నినాదాలు
-
జీ-20లో వందేమాతరం, జైశ్రీరామ్ నినాదాలు
టోక్యో : జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. కోబ్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్ గెస్ట్ హౌస్‌లో జీ-20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది. మోదీ ప్రసంగం అనంతరం వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో సభ మారుమోగింది. ఈ సదస్సులో మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచం దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడంలో జపాన్ పాత్ర కీలకమన్నారు. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో పలు అంతర్జాతీయ వేదికలపై తను పాల్గొనే విధానం తమ మధ్య ఉన్న స్నేహబంధం స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు. తాను 2014లో భారత దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత షింజో అబెతో దౌత్యపరమై సంబంధాలను ఇరు దేశాల ప్రజల్లోకి తీసుకువెళ్లామన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి భారతదేశ ప్రముఖులు స్వామి వివేకనందా, మహాత్మ గాంధీ, సుభాష్ చంద్రబోస్ తదితరులు జపాన్‌తో మంచి సంబంధాలను కొనసాగించారని వెల్లడించారు. రెండో ప్రపంచ ముద్దం అనంతరం భారత్, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయన్నారు. జీ-20 సదస్సు కు స్వాగతించిన తీరుకు మోదీ.. షింజో అబే, జీ-20 సదస్సు చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. ఇరువురు దేశాధినేతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, విపత్తు నిర్వహణ, ఆర్థిక నేరస్థులపై సుదీర్ఘంగా చర్చించారు. అక్టోబర్‌లో జరిగే జపాన్ చక్రవర్తి నరుహిటో పట్టాభిషేక వేడుకకి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరువుతారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ రెండోసారి ప్రధానిగా ఎనికైన తర్వాత జపాన్ ప్రధానితో సమావేశమవడం ఇదే తొలిసారి. -
ఉగ్రవాదమే పెద్ద సమస్య
బ్యూనోస్ ఎయిర్స్: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్ర«ధాని మోదీ శుక్రవారం అన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు బ్రిక్స్, జీ–20 దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీ–20 (గ్రూప్ ఆఫ్ 20) సదస్సు కోసం మోదీ అర్జెంటీనాలో పర్యటిస్తుండటం తెలిసిందే. అక్కడ బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన భేటీలో మోదీ ప్రసంగించారు. ఆర్థిక నేరగాళ్ల వల్ల ప్రపంచం ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు ఎదురవుతోందనీ, మోసాలు చేసి స్వదేశాల నుంచి పరారైన నేరగాళ్లకు వ్యతిరేకంగా కూడా అన్ని దేశాలూ సహకరించుకోవాలని ఆయన సూచించారు. బ్రిక్స్ దేశాధినేతల భేటీలోనే కాకుండా ప్రత్యేకంగానూ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌లతోనూ విడివిడిగా భేటీ అయ్యారు. వాతావరణ మార్పులపై ఈ నెల 3 నుంచి పోలండ్‌లో జరగనున్న కాప్24 సదస్సులో భారత్ కీలక, బాధ్యతయుతమైన పాత్ర పోషిస్తుందని గ్యుటెరస్‌తో మోదీ చెప్పినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడించారు. బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించిన యోగా ఫర్ పీస్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శాంతి, ఆరోగ్యం కోసం ప్రపంచానికి భారత్ అందించిన బహుమతి యోగా అని అన్నారు. ట్రంప్ చెడగొట్టారు: పుతిన్ జీ–20 దేశాల మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులపై గతంలో ఉన్న ఏకాభిప్రాయాన్ని ట్రంప్ చెడగొట్టారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారంలో రక్షణాత్మక ధోరణిని అవలంబిస్తుండటాన్ని పుతిన్ తప్పుబట్టారు. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో జీ–20 దేశాధినేతల తొలి సదస్సు సమయం నుంచి ఆర్థిక స్థిరత్వానికి తీసుకుంటున్న చర్యలను ట్రంప్ పాడుచేశారని పుతిన్ దుయ్యబట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా పుతిన్‌తో గొంతు కలిపారు. ట్రంప్, మోదీ, అబే భేటీ మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేల మధ్య తొలి త్రైపాక్షిక భేటీ శుక్రవారం జరిగింది. ప్రపంచ, బహుళ ప్రయోజనాలున్న ప్రధానాంశాలపై వారు చర్చలు జరిపారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కలిసి పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. ‘జై (జేఏఐ – జపాన్, అమెరికా, ఇండియా) సమావేశం ప్రజాస్వామ్య విలువలకు అంకితం. పలు భారతీయ భాషల్లో జై అంటే విజయం అని అర్థం’ అని మోదీ అన్నారు. ‘జై’ దేశాల తొలి త్రైపాక్షిక భేటీలో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని అబే చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొనాలని వారు ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. -
శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో నా ఆలోచనలు పంచుకున్నా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అంతకుముందు, జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు. కేడెట్ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. హ్యాకథాన్ విజేతలకు సత్కారం.. ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. సింగ పూర్ మంత్రి ఓంగ్ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
ఉమ్మడిగా ఉగ్రపీచం అణచేద్దాం
మనీలా: ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ‘ఆసియాన్–భారత్’ సదస్సులో మంగళవారం మోదీ నొక్కి చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పరోక్షంగా ఇలా సూచించారు. తూర్పు ఆసియా సదస్సులో ప్రసంగిస్తూ... కూటమితో పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ‘ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల కూటమి) ప్రాంతంలో నిబంధనల ఆధారిత భద్రతా వ్యవస్థ రూపకల్పనకు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఆసియాన్ కూటమి ప్రయోజనాలు, శాంతియుత అభివృద్ధికి ప్రామాణికమైన ఈ విధానానికి మేం అండగా ఉంటాం’ అని ఆసియాన్‌లో మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం చర్చల అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే ఈ ప్రాంతంలోని దేశాలన్ని కలసికట్టుగా ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమష్టిగా ప్రయత్నించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మనం విడిగా చాలా ప్రయత్నించాం. ఈ ప్రాంతంలో ప్రధాన సవాలును ఉమ్మడిగా పరిష్కరించేందుకు సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన తరుణమిదే’ అని చెప్పారు. ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం భారత్, ఆసియాన్ మధ్య ‘పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రధాని ప్రసంగిస్తూ.. ‘ఆసియాన్–భారత్ 25వ స్మారక వార్షికోత్సవాలకు సరైన ముగింపు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో–ఆసియాన్ ప్రత్యేక సదస్సులో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ప్రధాని చెప్పారు. భారత 69వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఆసియాన్ నేతలకు ఆహ్వానం పలికేందుకు భారత్‌లో 125 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్’(ఆర్సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి. ‘తూర్పు ఆసియా’ది కీలక పాత్ర ఆసియాన్–భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తూర్పు ఆసియా సదస్సు కీలక పాత్ర పోషించాలని భారత్ ఆశిస్తుందన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. చతుర్భుజంపై అబే, టర్న్‌బుల్‌తో చర్చలు ఆసియాన్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో విడిగా భేటీ అయ్యారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య చతుర్భుజ కూటమి ఏర్పాటు కోసం జరుగుతున్న కసరత్తుపై ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. ఆసియాన్ సదస్సు రెండో రోజున మోదీ వియత్నాం ప్రధాని న్యుయెన్ గ్జుయాన్ ఫుక్, బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా, న్యూజిలాండ్ ప్రధాని జసిందా అడెర్న్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబేతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేస్తూ.. ‘అబేతో సమావేశం అద్భుతంగా సాగింది. ఆర్థిక అంశాలతో పాటు ఇరు దేశ ప్రజల మధ్య సంబంధాల మెరుగుపై చర్చించాం’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు ఆ దేశంతో స్నేహ సంబంధాల్లో కొత్త ఉత్తేజం తీసుకొచ్చాయని ప్రధాని చెప్పారు. న్యూజిలాండ్, బ్రూనై దేశాధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగాయని మోదీ ట్వీటర్లో వెల్లడించారు. కాగా తూర్పు ఆసియా సదస్సు వేదికగా చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ప్రధాని కొద్ది సేపు చర్చించారు. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి భారత్‌కు బయల్దేరారు. -
ఆసియాన్‌లో ఉల్లాసంగా !
మనీలా: మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ‘ఆసియాన్–భారత్’, ‘తూర్పు ఆసియా’ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకున్నారు.అనంతరం ఈ సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన దేశాధినేతల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్తె ఇచ్చిన ఈ విందులో మోదీ అందరితో మాట్లాడుతూ ఉల్లాసంగా కనిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని మెద్వెదెవ్, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా ఫిలిప్పీన్స్ జాతీయ దుస్తులైన తెల్లని ‘బారంగ్ టాగలాంగ్’ను ధరించి విందులో పాల్గొన్నారు. పలువురు నేతలతో ముచ్చటిస్తున్న ఫొటోల్ని ప్రధాని మోదీ ట్వీటర్లో పోస్టు చేశారు. నేడు అమెరికా అధ్యక్షుడితో చర్చలు ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల వేదికగా జరిగే ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు దేశాధ్యక్షులతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్, రష్యా ప్రధాని మెద్వెదెవ్‌తో ఆయన చర్చలు జరుపుతారు. సోమవారం ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరిస్థితితో పాటు పరస్పర ప్రయోజన అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ చెప్పేందుకు భారత్ ముఖ్య పాత్ర పోషించాలని అమెరికా కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ద్యుతెర్తెతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు కొనసాగిస్తారు. పలు అంశాలను ప్రస్తావించనున్న మోదీ మంగళవారం ఆసియాన్–భారత్, తూర్పు ఆసియా సదస్సుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు, తిరుగుబాటు ధోరణిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ విధాన రూపకల్పనపై ఒత్తిడి తీసుకురావడం, ప్రాంతీయ వాణిజ్య ప్రోత్సాహంపై ఈ సదస్సుల్లో మోదీ ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఆసియాన్ సదస్సులో వాణిజ్యం, పెట్టుబడుల అంశాలతో పాటు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి, ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షల అంశాల్ని.. తూర్పు ఆసియా సదస్సులో మ్యారీటైం భద్రత, ఉగ్రవాదం, అణు నిరాయుధీకరణ, వలసలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆసియాన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పాల్గొనడంతో పాటు ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్’(ఆర్సీఈపీ)లో సభ్య దేశాల నేతలతో కూడా సమావేశమవుతారు. ఈ పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌లో భారతీయ సమాజం ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం, మహావీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్‌ను మోదీ సందర్శిస్తారు. ఫిలిప్పీన్స్‌లో భారత రాయబారి జైదీప్ మజుందార్ మాట్లాడుతూ.. ‘ఇండో–ఫసిపిక్‌లో భారత్ మరింత కీలకంగా వ్యవహరించాలని ఆసియాన్‌లోని ప్రతీ దేశం కోరుతుంది’ అని పేర్కొన్నారు. తూర్పు ఆసియా సదస్సులో ‘ఆసియాన్’ సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా పాల్గొంటున్నాయి. చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యం! వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు చెక్ పెట్టేలా భద్రతా సహకారంపై చర్చించేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆ స్ట్రేలియా అధికారులు తొలిసారి మనీలాలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండో–పసిఫిక్‌ను స్వేచ్ఛాయుత ప్రాంతంగా మార్చే అంశంపై ఈ నాలుగు దేశాలు చర్చించాయి. పరస్పర ప్రయోజనమున్న అంశాలపై కూడా చర్చలు కొనసాగాయి. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తూ‘ ఇండో–పసిఫిక్‌పై మరిన్ని చర్చలు కొనసాగించాలని, అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించాం’ అని పేర్కొన్నాయి. కలిసికట్టుగా పనిచేసేలా, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సామరస్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంగా చర్చలు సాగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్మడి సవాలుగా మారిన ఉగ్రవాదం, ఉగ్రవ్యాప్తిపై కూడా సమావేశంలో చర్చించారని తెలిపింది. -
బుల్లెట్ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ
-
బుల్లెట్ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ
సాక్షి, అహ్మదాబాద్: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో హైస్పీడ్ కనెక్టివిటీ ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు. ముంబయి, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులను ప్రారంభించిన అనంతరం ఈ ప్రాజెక్టుతో మేక్ ఇన్ ఇండియా ఆశయాలు మున్ముందుకు సాగుతాయని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. భారత్, జపాన్ల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరువురు నేతలు అన్నారు. అహ్మదాబాద్‌లో శంకుస్ధాపన కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో నవభారత్ ఆవిష్కరణకు ఉత్తేజం లభిస్తుందని, మన స్వప్నాలు ఫలించేలా దేశం సగర్వంగా ముందుకు సాగేందుకు బాటలు పడతాయని అన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం, అవరోధాలు లేకుండా ముందుకెళ్లేందుకు జపాన్ ప్రధాని అబే ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ కేవలం 0.1 శాతం వడ్డీతో రూ 80,000 కోట్ల రుణం మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన టెక్నాలజీ జపాన్ అందిస్తుండగా, పరికరాలు, తయారీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని అన్నారు. రూ 1.10 లక్షల కోట్లతో చేపట్టే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య 500 కిమీ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టును భారత రైల్వేలు, జపాన్‌కు చెందిన షిన్కన్సెన్ టెక్నాలజీలు సంయుక్తంగా చేపడతాయి. -
మనకూ 'బుల్లెట్'
-
మనకూ 'బుల్లెట్'
- ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి రూ. 98,000 కోట్ల జపాన్ సాయం - భారత ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు పెడుతుంది: ప్రధాని మోదీ - మేకిన్ ఇండియాకు 12 బిలియన్ డాలర్ల నిధి: షింజో అబే - భారత్-జపాన్ విజన్ 2025పై సంయుక్త ప్రకటన - పౌర అణుశక్తి సహకారం, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ: భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యం కొత్త రెక్కలు తొడిగింది. జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని మోదీ మధ్య శనివారం ఢిల్లీలో జరిగిన భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు.. రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుతోపాటు పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో కీలక సహకారం వంటి ముఖ్యమైన 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం వంటి ఒప్పందాలూ ఉన్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై - గుజరాత్ ముఖ్య వ్యాపార కేంద్రం అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు 12 బిలియన్ డాలర్ల (రూ. 98వేల కోట్లు) ప్యాకేజీ ఇవ్వటంతో పాటు సాంకేతికంగా పూర్తి సహకారం అందించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ ఒప్పందం చారిత్రాత్మకమని.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ కలలను జపాన్ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదన్నారు. తొలి బుల్లెట్ రైలు కల సాకారానికి సహాయం చేస్తున్న జపాన్ ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒప్పందం భవిష్యత్తులో భారత రైల్వే వ్యవస్థ అభివృద్ధికి నాంది పలకనుంది. భారత ఆర్థిక వ్యవస్థ మార్పుకు ‘బుల్లెట్ రైలు ఒప్పందం’ ఇంజన్ వంటిద’ని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల కాల వ్యవధికి.. 0.1 శాతం వడ్డీతో 80 శాతం నిధులను (రూ.98వేల కోట్లు) జపాన్ అందించనుంది. దీంతో పాటు పౌరఅణు ఒప్పందంలో సహకారం, రక్షణ రంగ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవటంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు.. దక్షిణ చైనా సముద్రం, ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మొదలైన అంశాలపైనా ఇద్దరు ప్రధానులు చర్చించారు. ‘భారత్-జపాన్ విజన్ 2025; ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం-భారత, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుహృద్భావం నెలకొనేందుకు సంయక్తంగా పనిచేయటం’పై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు తూర్పు ఆసియా ప్రాంతంలో భద్రత, శాంతి నెలకొల్పటం.. దక్షిణ చైనా సముద్ర వివాదంలో 2002లో చేసుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలని మోదీ-అబేలు నిర్ణయించారు. - ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డీఎంఐసీ) ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించటంపై చర్చించారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) పనుల్లో అభివృద్ధిపై ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి దశలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం.. ఇందుకు అవసరమైన నిధులపై మోదీ-అబే చర్చించారు. మోదీ: ఈ సదస్సుతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనున్నాయి. అపెక్ సభ్యత్వం విషయంలో సహకరించిన అబేకు కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ శాశ్వత సభ్యత్వం సాధిస్తాం. ప్రపంచ శాంతి, భద్రత విషయంలో కొత్త భాగస్వామ్యానికి జపాన్‌తో పౌర అణుశక్తి సహకార ఒప్పందం తోడ్పడుతుంది. రక్షణ రంగంలో చేసుకున్న ఒప్పందాలు ఇరు దేశాల సైన్యం పరస్పర సహకారానికి కీలకం. ఈ సదస్సులో వివిధ విభాగాల్లో ప్రత్యేక భాగస్వామ్యానికి గుర్తుగా జపాన్ పౌరులకు మార్చి 1 2016 నుంచి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించనున్నాం అబే: ‘మేకిన్ ఇండియా’కు సహకారం అందించేందుకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశాం. జపాన్ తయారీరంగ కంపెనీలు భారత్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధులను వినియోగిస్తాం. దీంతోపాటు విదేశీ అభివృద్ధి సాయం (ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ టు ఇండియా) కింద భారత్‌కు మరో 5 బిలియన్ డాలర్లు అందిస్తాం. భారత్‌లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు.. 13 జపాన్ పారిశ్రామిక వాడల (జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్) అభివృద్ధికి సహకరిస్తాం. భారత్-జపాన్ మధ్య జరిగిన 16 ఒప్పందాలు: 1. శాంతియుత వినియోగానికి పౌర అణుశక్తి సహకార ఒప్పందం 2. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం 3. రక్షణ రంగంలో పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మార్పునకు ఒప్పందం 4. పరస్పర మిలటరీ సమాచారం మార్పిడి చేసుకునే ఒప్పందం 5. రెండు దేశాల మధ్య డబుల్ టాక్సేషన్ తొలగింపు ఒప్పందం 6. భారత రైల్వేలు, జపాన్ మౌలిక వసతుల మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం 7. భారత్‌లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత రైల్వే వ్యవస్థకోసం జపాన్ రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందం 8. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం. 9. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు యువ పరిశోధకుల పరస్పర మార్పును సహకారం. 10. భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ విభాగం, జపాన్ ఆరోగ్య శాఖ మధ్య సహకారం. 11. ఇరు దేశాల మానవ వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంస్కృతి, క్రీడలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం 12. నీతి ఆయోగ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ఆఫ్ జపాన్ మధ్య ఒప్పందం 13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తోయామా ప్రిఫెక్షర్ మధ్య పరస్పర సహకార ఒప్పందం 14. కేరళ ప్రభుత్వం, జపాన్‌లోని మూడు నగరాల మేయర్ల మధ్య అభివృద్ధి ఒప్పదం. 15. ఐఐఎం అహ్మదాబాద్, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలసీ మధ్య ఒప్పందం 16. భారత పర్యావరణ శాఖ, జపాన్ వ్యవసాయ, అటవీ శాఖ మధ్య సహకారం.