
న్యూఢిల్లీ: జీ–20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌కు బయల్దేరారు. ఈ పర్యటనలో మోదీ పలువురు దేశాధినేతలతో భేటీ కానున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే, మోదీతో కలసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్రైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని శ్వేతసౌధం ప్రకటించింది. ఈ సమావేశం నవంబర్ 30 లేదా డిసెంబర్ 1న జరిగే అవకాశాలున్నాయి. త్రైపాక్షిక భేటీకి ముందు, ట్రంప్–అబేల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గు రి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. జీ–20 సదస్సు సందర్భంగా ట్రంప్–చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ట్రంప్–రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగే సమావేశాలపైనే అందరి దృష్టి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment