
రోమ్: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్ వింగ్‌కు చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటీలీ పార్టీ అధ్యక్షురాలు జియార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు.
ప్రధాని అయ్యాక మెలోని ఫైర్ బ్రాండ్‌గా ముందుకుసాగుతారని అంతా భావిస్తున్నారు. ఇటలీ అంతర్జాతీయ సంబంధాలు, వలసదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అలాగే దేశ అప్పులను తగ్గించేందుకు స్థిరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడాతరని అనుకుంటున్నారు.
సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెలోని సారథ్యంలోని బ్రథర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ మొత్తం 400 స్థానాలకు 118 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇతరుల మద్దతుతో 237 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెలోని ఇప్పటికే కేబినెట్‌ను కూడా ప్రకటించారు.
చదవండి: ‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’
Comments
Please login to add a commentAdd a comment