ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు జమ్ము కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రేపు(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
కాగా, ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, జమ్ము, కశ్మీర్‌లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. ఇక, వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు పీఎంలో ఓ ప్రకటనలో తెలిపింది.
Jammu and Kashmir Police have strengthened security in Srinagar ahead of Prime Minister Narendra Modi’s two-day visit starting Thursday.#JammuKashmir #Srinagar #Kashmir pic.twitter.com/6bnIVaGowZ
— Kashmir Local News (@local_kashmir) June 20, 2024
ఇక, రేపు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని ఎస్‌కేఐసీసీలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగించే అవకాశం ఉంది. కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్యపథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. మోదీ కశ్మీర్ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతాను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment