ఖాట్మండూ: ప్రపంచమంతటా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో యోగా పుట్టలేదని, నేపాల్‌లోనే యోగా పుట్టిందని వ్యాఖ్యానించారు. భారత్ ఓ దేశంగా ఏర్పడక ముందే నేపాల్‌లో యోగా ప్రాక్టీస్ చేసేవారు అని అన్నారు.అసలు యెగా కనుగొన్నప్పుడు భారత్ ఏర్పాటు కాలేదని అయన వ్యాఖ్యానించారు.యోగా కనుగొన్న మా పూర్వికులు ఎవరికీ మేం గుర్తింపు ఇవ్వలేదు. యోగా ప్రొఫెసర్స్, వారి సేవల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం తప్ప మేమెప్పుడూ ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో యోగా కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు.గతంలోనూ కేపీ శర్మ ఓలి శ్రీరాముడు నేపాల్ లో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో సారి తన వాదనను పునరుద్ఘాటించారు.రాముడు భారత్‌లోని అయోధ్యలో జన్మించలేదని, ఆయన నేపాల్‌లోని చిత్వాన్ జిల్లా అయోధ్యపురి వద్ద వాల్మీకి ఆశ్రమంలో పుట్టాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే అక్కడ రాముడు, సీత, లక్ష్మణ ఇతరుల ఆలయ నిర్మాణాలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు.
చదదవండి:చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్‌సంగ్
Comments
Please login to add a commentAdd a comment