యోగా చేయడానికి సౌకర్యవంతమైన ప్రదేశం మాత్రమే కాదు అనువైన దుస్తులు ఉండటం కూడా అవసరం. నవతరం అభిరుచికి తగినట్టు ఇటీవల యోగా వేర్ కొత్తగా రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా నేతన్నలు చరఖాతో దారం వడికి మగ్గంపై నేసిన కాటన్‌తో తయారైన యోగా వేర్‌కి డిమాండ్ పెరుగుతోంది. మేనికి హాయిగొలిపేలా సౌకర్యంగా, వదులుగా ఉండే దుస్తుల డిజైన్లే యోగా వేర్‌లో కీలకమైన అంశాలు. యోగా డే సందర్భంగా సౌకర్యవంతమైన హంగులను మనమూ సొంతం చేసుకుందాం.
– కాటన్ స్మోక్డ్ వెయిస్ట్ క్రాప్ టాప్ బాటమ్‌గా బ్లాక్ హారమ్ ప్యాంట్ ధరించడంతో క్రీడాకారిణి లుక్ వచ్చేస్తుంది.
– ఆర్గానిక్ కాటన్‌తో డిజైన్ చేసిన ప్రింటెడ్ క్రాప్ టాప్, హారమ్ ప్యాంట్ ఇది.
– మిడ్ లెంగ్త్ స్లీవ్స్ కాటన్ టాప్, సైడ్ పాకెట్స్ ఉన్న కాటన్ ప్యాంట్‌తో యోగా కదలికలలో సౌకర్యంగా ఉంటుంది.
– కాటన్ షార్ట్ కుర్తీ లేదా క్రాప్ టాప్స్‌ని ధోతీ ప్యాంట్‌తో జత చేస్తే యోగసాధనలో సౌకర్యవంతమైన సంప్రదాయ శైలి కనిపిస్తుంది.
– కాటన్ బెల్టెడ్ టాప్‌కి, పెన్సిల్ కట్ ప్యాంట్ యోగావేర్‌లో స్మార్ట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది.
– యోగా వేర్‌లో జంప్‌సూట్ డిజైన్స్ సౌకర్యాన్ని ఇస్తాయి.
పర్యావరణ స్పృహ, వ్యక్తిగత శైలి, సౌకర్యం.. వీటిని దృష్టిలో పెట్టుకుని యోగా డ్రెస్ డిజైన్స్‌ని మెరుగుపరచవచ్చు.
యోగా సాధనలో సౌకర్యవంతంగా, పర్యావరణ స్పృహని కలిగించే సంప్రదాయ యోగా డ్రెస్సులను ఎంచుకోవచ్చు. వీటికి ఆధునిక డిజైన్స్‌నీ కలపవచ్చు.
లేత రంగులు, ప్లెయిన్‌గా ఉండే చేనేత వస్త్రాలు యోగా చేయడానికి సౌకర్యంతోపాటు హుందాతనాన్నీ పరిచయం చేస్తాయి.
నడుము దగ్గర కాటన్ బెల్ట్, కాలి మడమల దగ్గర ప్రత్యేకమైన డిజైన్‌ని జోడించడం ద్వారా యోగా డ్రెస్సులను ఆకర్షణీయంగా మార్చేయవచ్చు.
యోగాలో సౌకర్యం చాలా ముఖ్యమైనది. శ్వాసక్రియకు పర్యావరణ అనుకూలమైన దుస్తులను ఎంచుకుంటే ఫ్యాషన్‌గానే కనిపిస్తాం.
శరీర కదలికలకు తగినట్టు డ్రెస్ కూడా ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సహజ రంగులను ఉంచుకోవాలి.
స్టైల్‌గా ఉండాలనుకుంటే హై వెయిస్టెడ్ ప్యాంట్స్, ర్యాప్‌టాప్‌ల వంటివి మార్కెట్లో లభిస్తున్నాయి. హైవెయిస్ట్ లెగ్గింగ్స్, క్రాప్‌టాప్స్, స్పోర్ట్స్ బ్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
హెయిర్ హెడ్ బ్యాండ్స్, సన్నని బ్రాస్‌లెట్స్, స్టడ్స్ లేదా చెవి ΄ోగులు వంటి తేలికైన ఆభరణాలను ధరించాలి.
పార్క్ లేదా యోగా క్లాసులకు వెళ్లేటప్పుడు వెంట ఆర్గానిక్ కాటన్ లేదా రీ సైకిల్ చేసిన బ్యాగ్‌లో యోగాకు ఉపయోగించే మ్యాట్‌ను, వాటర్ బాటిల్‌నూ వెంట తీసుకెళ్లవచ్చు.
యోగా ప్రయోజనాన్ని ఆనంద దాయకంగా మార్చుకోవాలంటే మాత్రం మీ అభ్యాసమే ముఖ్యమైనది.
Comments
Please login to add a commentAdd a comment