హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పాల్గొన్నారు. రాజ్ భవన్లో ఆదివారం ఉదయం నిర్వహించిన యోగాసనాల్లో గవర్నర్తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా 'యోగా'ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అలా చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని తెలిపారు.