
ఈజిప్టు పిరమిడ్ల వద్ద ...
అలెగ్జాండ్రియా నుంచి ఇస్మైలియా దాకా పలు నగరాల్లో యోగా డేను నిర్వహిస్తున్నట్లు భారత రాయబారి సంజయ్ భట్టాచార్య తెలిపారు. పిరమిడ్లు, కైరోలోని తాహ్రిర్ స్క్వేర్ వద్ద ‘ఫ్లాష్ మాబ్’ (అకస్మాత్తుగా కొందరు యువతీయువకులు గుమిగూడి కాసేపు నృత్యం చేసి... అంతేవేగంగా వెళ్లిపోతారు. జనం దృష్టిని ఆకర్షించడానికి ఈ ఫ్లాష్‌మాబ్‌లు నిర్వహిస్తుంటారు)కు భారత రాయబార కార్యాలయం ప్లాన్ చేసింది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లోని రబిన్ స్క్వేర్ వద్ద వేలాదిగా జనం యోగా డేలో పాల్గొననున్నారు. అయ్యంగార్, అస్థాన, త్రి యోగా, విన్యాస యోగా, ఆక్రో యోగాలలో తరగతులు నిర్వహించనున్నారు. యోగా, ఆయుర్వేదంపై అవగాహన పెంచడానికి సమాచార కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.