గాజా: ఇజ్రాయెల్, హమస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే, మూడు రోజుల విరమణ ఒప్పందం పూర్తికాగానే.. బుధవారం రాత్రి గాజా నుంచి రాకెట్ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సమాధానమిచ్చింది. కానీ, అదృష్టవశాత్తూ కాసేపటికే ఆ దాడులు సద్దుమణిగాయి. ఇరు వర్గాలు సంయమనం పాటించాయి. కాల్పుల విరమణ కొనసాగిస్తామని ప్రకటించాయి. దాంతో సోమవారం అర్ధరాత్రి వరకు గాజాలో శాంతి నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది.
ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, హమస్‌ల మధ్య శాంతి చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని పాలస్తీనా తరఫున చర్చల్లో పాల్గొంటున్న అజమ్ అల్ అహ్మద్ తెలిపారు.