
సుబ్బాయమ్మ నాగుబడి ఆధ్వర్యంలోని వినోద్ నాగుబడి ఈచ్ లైఫ్ ఈస్ ప్రిషియస్, డాక్టర్ నీతా ఫియోనా నాగుబడి ఆధర్యంలోని మ్యాంగో నెట్‌వర్స్క్ సంయుక్తంగా ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్పరైసోలో జరిగిన ఈ కార్యక్రమానికి రిచార్డ్స్ లీగల్ నుంచి హషీ నాగుబడి రిచర్డ్స్, ఆల్ స్టార్ బ్రైట్ నుంచి జాజ్ రిచర్డ్స్, ఎథ్నిక్ ఈవెంట్స్ నుంచి నీతా ఫియోనా స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ నుంచి ప్రత్యేక అతిథిగా యోగాచార్య డాక్టర్ ప్రేరణ ఆర్య హాజరయ్యారు. ఆమెకు వాల్పరైసో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ డైరక్టర్ మ్యాగి క్లిఫ్టన్ రోజా పూలతో స్వాగతం పలికారు.
తొలుత భారత్, అమెరికా జాతీయ గీతాలు, ప్రేరణ ఆర్య సంగఠన్ మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిచర్డ్ డెలుకా క్లాసిక్ యోగా, కరెన్ కిన్సే సంపూర్ణ యోగా చేశారు. అనంతరం భారత ప్రభుత్వ విధానాలను అనుసరించి ప్రేరణ యోగా కార్యక్రమం నిర్వహించారు. వాల్పరైసో వైఎంసీఏ అనిత చైర్ యోగా నిర్వహించారు. స్థానిక యోగా టీచర్ సుజానే చిక్ కూడా కార్యక్రమానికి హాజరయిన వారిచే పలు యోగాసనాలు వేయించారు. చివరిగా ప్రేరణ శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. కాగా, వరుసగా రెండో ఏడాది ఇలా యోగా వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని నిర్వహకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment