ఆరోగ్యానికి శుభయోగం | health benefits of yoga | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి శుభయోగం

Published Sat, Jun 22 2024 10:38 AM | Last Updated on Sat, Jun 22 2024 11:29 AM

health benefits of yoga

ఆధునిక జీవితంలో ఒత్తిడి వల్ల ఎంతోమంది కష్టపడుతున్నారు. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి వాటి వల్ల శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయి. వాటికి చెక్‌ పెట్టే శక్తి యోగాకు ఉంది. ఎందుకంటే ఇది శారీరక వ్యాయామం మాత్రమే కాదు... మానసిక, ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రశాంతతను అందిస్తుంది. అయితే యోగాను ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరెవరు చేయవచ్చు, యోగా చేసేవారు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి... వంటి వివరాలు తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన ఆహారం
యోగా చేసేవారికోసం కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం శరీరానికి, మనసుకు అనువైన ఆహారాన్ని తినాలని చెబుతోంది. శాకాహారం తినడమే యోగా సాధనకు మంచిదని వివరిస్తోంది. ముప్పై ఏళ్ల వయసు దాటిన వ్యక్తి లేదా అనారోగ్యం, అధిక శారీరక శ్రమ వంటివి పడుతున్న వ్యక్తులు తప్ప మిగతా వారంతా రోజుకు రెండు పూటలా తింటే సరి΄ోతుందని, అది కూడా శాకాహారం తింటే మంచిదని చెబుతోంది ఆయుష్‌.

యోగా వల్ల ఈ రోగాలన్నీ పరార్‌
ప్రతిరోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ప్రయోజనాలు ఎన్నో కలుగుతాయి. వైద్య పరిశోధనలు కూడా యోగా అనేక రోగాలను దూరం పెడుతుందని చెబుతున్నాయి. ప్రతిరోజూ ΄ావుగంట నుంచి అరగంట ΄ాటు యోగా చేస్తే చాలు శారీరక దృఢత్వంతో ΄ాటు కార్డియోవాస్కులర్‌ అనారోగ్యాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. మధుమేహం, అధిక రక్త΄ోటు, శ్వాసకోశ వ్యాధులు వంటివాటిని అదుపు చేయడంలో యోగా ఎంతో సాయపడుతుంది.

జీవనశైలి సంబంధిత రుగ్మతలను తట్టుకోవడంలో యోగా ముందుంటుంది. ఎవరైతే డిప్రెషన్, మానసిక ఒత్తిడి, అలసట వంటి వాటితో బాధపడుతున్నారో వారు ప్రతిరోజు యోగా చేయడం చాలా అవసరం. ఇక మహిళలు ప్రతిరోజు యోగా చేయడం వల్ల నెలసరి సమస్యలు తగ్గుతాయి. యోగా అనేది ఆరోగ్యమైన శరీరాన్ని అందించడమే కాదు, మనసును స్థిరంగా ఉంచే ప్రక్రియ. ఇది సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఒక దారి చూపిస్తుంది.

యోగా చేసే ముందు...
ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి. యోగాభ్యాసాన్ని ఖాళీ ΄÷ట్టతో చేయాలి లేదా తేలిక΄ాటి ఆహారాన్ని తిన్నాక చేయాలి. మరీ బలహీనంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిలో కాస్త తేనె వేసుకొని తాగి యోగా చేయవచ్చు. యోగాభ్యాసాన్ని చేసే ముందు మూత్రాశయం, పేగులు ఖాళీగా ఉండాలి. అంటే ముందుగానే కాలకృత్యాలు తీర్చుకుంటే మంచిది. తేలికైన, సౌకర్యవంతమైన కాటన్‌ దుస్తులను ధరించి చేయడం మంచిది. 

ఎవరైతే తీవ్ర అలసటతో, అనారోగ్యాలతో బాధపడుతున్నారో అలాంటివారు యోగా చేయకూడదు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా యోగాభ్యాసాలను చేసేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. గర్భం ధరించిన వారు, నెలసరిలో ఉన్నవారు కూడా యోగా చేసేముందు యోగా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement