గాంధర పూలు
సాక్షి, డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల కురుస్తున్న వర్షాలకు మన్యం కొత్త అందాలను సంతరించుకుంటోంది. చల్లని వాతావరణంలో పచ్చని సోయగాలు కనువిందుచేస్తున్నాయి. వీటికి తోడు శ్వేతవర్ణంలోని గాంధర పూలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఇవి ఏటా ఏప్రిల్ నెలలో విరబూస్తాయి. స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి ఆనుకుని ఉన్న అటవీప్రాంతంలో విరబూసిన ఈ పూలను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. గుంటసీమ ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహన చోదకులకు ఇవి కనువిందు చేస్తున్నాయి.
అటవీ ప్రాంతంలో ఉన్న గాంధర పూల తోట
కొమ్మకొమ్మకు కపోతం
సాక్షి, పాడేరు: ప్రేమకు, శాంతికి చిహ్నమైన పావురాలు గుంపులు గుంపులుగా ఎగురుతూ పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి పంచాయతీ పెద్దగొందిలో స్థానికులకు కనువిందుచేస్తున్నాయి. గ్రామానికి చెందిన ఓ గిరిజనుడి తన ఇంటి వద్ద 40 పావురాలు పెంచుకుంటున్నాడు. వీటి కువకువలు, రెక్కల చప్పుళ్లతో ఆ ప్రాంతంలో ఆహ్లాదమైన వాతావరణం నెలకొంది. కపోతాలన్నీ ఓ చెట్టు వద్ద చేరి సందడి చేస్తున్న దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది.
చెట్టుపై కనువిందు చేస్తున్న పావురాలు
Comments
Please login to add a commentAdd a comment