
మా తరఫున పోరాడండి
పొన్నాలను కోరిన మల్లన్నసాగర్ ముంపు బాధితులు
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల బాధితులు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను గురువారం కలిశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యంపై కొరవడిన స్పష్టత, అధికారుల నిర్లక్ష్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల ఆగడాలతో ముంపు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పొన్నాలకు వివరించారు. భూములను ప్రజల అవసరాల కోసం తీసుకుంటున్నప్పుడు రైతులకు ఇచ్చే పరిహారం విషయంలోనూ, హక్కుల విషయంలోనూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. తమ పక్షాన పోరాడాలని పొన్నాలకు వివిధ గ్రామాల రైతులు విన్నవించారు.