అందరి చిట్టాలూ బయటపెడతాం | Harish Rao on Illegal registration of Miyapur lands | Sakshi
Sakshi News home page

అందరి చిట్టాలూ బయటపెడతాం

Published Fri, Jun 16 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

అందరి చిట్టాలూ బయటపెడతాం

అందరి చిట్టాలూ బయటపెడతాం

భూ అక్రమాల వ్యవహారంపై హరీశ్‌రావు
► మియాపూర్‌లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదు
► అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని బయటపెట్టింది సర్కారే
► సీఎం కుటుంబ సభ్యులు ఉన్నారంటూ గోబెల్స్‌ ప్రచారం
► పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తన ఆరోపణలు రుజువు చేయాలి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూ అక్రమాల వ్యవహారంలో విపక్ష నేతలు సహా అందరి చిట్టాలూ బయటపెడతామని.. ఎవరినీ వదలబోమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నా రు. మియాపూర్‌ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని.. ఖజానాకు నయాపైసా నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

ఈ వ్యవహారంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపిస్తున్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... ఎవరెవరు న్నారో చెప్పాలని, లేదంటే హైదరాబాద్‌ అబిడ్స్‌ సెంటర్‌లో ముక్కు నేలకు రాయాలని సవాల్‌ చేశారు. గురువారం టీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష కార్యాలయంలో ఎంపీ బాల్క సుమన్, మిషన్‌ భగీరథ వైస్‌చైర్మన్‌ ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విపక్షాలు తీవ్ర నిరాశా, నిస్పృహల్లో ఉన్నాయని.. ప్రభుత్వా నికి మంచి పేరు రావడం ఇష్టం లేకనే అడ్డగోలు విమర్శలకు దిగుతున్నాయన్నారు.

కాంగ్రెస్, టీడీపీల పాపాల వారసత్వం..  
నిజాం హయాంలోని జాగీరు భూములను అప్పట్లోనే తగిన పరిహారం చెల్లించి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నాయని.. కానీ ఆ తర్వాత వారసులమని చెప్పుకుంటూ కొందరు వివాదాలు సృష్టిస్తూ వచ్చారని హరీశ్‌ చెప్పారు. అప్పటి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోనందువల్లే ఆ పాపాలు వారసత్వంగా వచ్చాయన్నారు. ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా కేసీఆర్‌ అని.. మీడియానో, ప్రతిపక్షాలో కాదని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వమే అక్రమ రిజిస్ట్రేషన్ల అంశాన్ని బయటకు తెచ్చి కఠిన చర్యలు చేపట్టిందని... ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని, ఏసీబీ దాడులు జరిగాయని, సీబీసీఐడీకి దర్యాప్తు అప్పజెప్పామన్నారు. ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’తో నష్టం జరుగుతోందని గుర్తించి దానిని రద్దు చేశామని.. సబ్‌ రిజి స్ట్రార్లకు విచక్షణాధికారాలు కల్పిస్తున్న సెక్షన్‌–47 రద్దు చేశామని తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ ఆఫీసులను ప్రక్షాళన చేశామని.. ప్రభుత్వ భూముల వివరాలను అన్ని రిజి స్ట్రేషన్‌ కార్యాలయాలకు పంపామని చెప్పా రు. 1971 జాగీర్దార్‌ భూచట్టంలో సమూల మార్పులు తీసుకువచ్చి, వివాదాలకు తెర దించుతామని తెలిపారు. ఇలా ప్రభుత్వమే అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. విపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నా యే తప్ప ఒక్క డాక్యుమెంటునైనా బయట పెట్టాయా అని ప్రశ్నించారు. భూముల దగ్గరకు వెళ్లి ఫొటోలు దిగడం తప్ప విపక్ష నేతలు చేసిందేమిటని నిలదీశారు.

అవినీతికి పునాదులు వేసింది కాంగ్రెస్, టీడీపీలే...
‘‘రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచా లను పెంచి పోషించింది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కాదా..? రూపాయి లంచం ఇవ్వకుండా గతంలో ఎన్న డన్నా పని జరిగిందా..’’ అని హరీశ్‌ నిలదీశారు. అవినీతికి పునాదులు వేసిం దే వారని విమర్శించారు. రిజి స్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమాలను నిర్మూలిం చేందుకు త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు.

వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం
అసలు భూముల కుంభ కోణాల చరిత్ర కాంగ్రెస్‌దేనని హరీశ్‌రావు విమ ర్శించారు. ‘‘ఈఎన్‌టీ, ఈఎస్‌ఐ ఆసుపత్రుల భూములను అప్పట్లో హైదరా బాద్‌కు చెందిన కాంగ్రెస్‌ మంత్రులు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పలేదా? భూదాన్‌ భూములు, అమీన్‌పూర్‌ స్వాతంత్య్ర సమర యోధుల భూములు, ఐఎంజీ భూములు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కుంభకోణాలన్నీ ఎవరివి? వరంగల్‌లో దళి తులకు ఇచ్చిన అసైన్డ్‌ భూములు కొన్న పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీ హౌస్‌కమిటీ విచారణను ఎదుర్కోవడం లేదా’’ అని నిలదీశారు.

ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అంశమూ లేనందునే విపక్షాలు భూముల అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఇకపై విపక్ష నేతల చిట్టాలను కూడా బయట పెడతామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా, ఏ పార్టీ వారైనా ఉపేక్షించబోమని... కాంగ్రెస్‌ నేతల సంగతి కూడా బయటపెడతామని అన్నారు. వాస్తవాలను ప్రజల ముందు పెడతామన్నారు. కోదండరాంకు ప్రభుత్వం కంపు లాగా ఎందుకు కనబడుతోందో అర్థం కావడం లేదన్నారు. మరి ఆయనకు కాంగ్రెస్‌ నేతల కంపు కనబడడం లేదా అని.. ఆయన ప్రొఫెసరా, మరేమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement