తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతాంగం పరిస్థితి దయ నీయంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పంట ఉత్పత్తులు, రుణాల మంజూరు, సాగు విస్తీర్ణం... ఇలా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ అనుబంధమైన అన్ని రంగాల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ప్రభుత్వం సమా ధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.